వికారాబాద్(Vikarabad) జిల్లా తాండూరు(thanduru) ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి(Pilot Rohit Reddy) గత 13 రోజులుగా శ్రీ రాజశ్యామల, శత చండీ, సౌర, లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం(athirudra Mahayagam) చేస్తున్నారు. గురువారం మహాపూర్ణాహుతితో అతిరుద్ర మహా యాగం పూర్తి కానుంది.

Rohiht Reddy
వికారాబాద్(Vikarabad) జిల్లా తాండూరు(Tandoor) ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి(Pilot Rohit Reddy) గత 13 రోజులుగా శ్రీ రాజశ్యామల, శత చండీ, సౌర, లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం(athirudra Mahayagam) చేస్తున్నారు. గురువారం మహాపూర్ణాహుతితో అతిరుద్ర మహా యాగం పూర్తి కానుంది. గురువారం ఉదయం శ్రీ కామాక్షీ పీఠం(శ్రీకాకుళం)కు చెందిన వేద పండితులు ప్రధాన యాగశాలలో పూర్ణాహుతి నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు(Fire) ఎగిసిపడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు వెంటనే ఫైర్ ఇంజన్(Fire engine) కి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
