పవిత్ర శ్రీశైలం(Srisailam) క్షేత్రంలో విధులలో ఉన్నసిబ్బంది కొందరు మద్యం సేవించి(alcohol) ఉండటాన్ని భక్తులు గమనించారు.

పవిత్ర శ్రీశైలం(Srisailam) క్షేత్రంలో విధులలో ఉన్నసిబ్బంది కొందరు మద్యం సేవించి(alcohol) ఉండటాన్ని భక్తులు గమనించారు. ఆగ్రహంతో ఉన్న భక్తులు సిబ్బందిని చితకబాదారు. అయితే వారు ఆలయ సిబ్బంది(Temple) కాదని, ప్రయివేటు సంస్థ నుండి ఉద్యోగంలో చేరినట్లు స స్థానిక అధికారులు చెబుతున్నారు. ఆలయం ముందు ధర్నా చేపట్టారు భక్తులు. తాగి ఉన్న వారిని పోలీసులకు అప్పగించారు. ఇంత జరుగుతున్నా ఆలయ ఈవో పట్టించుకోవడం లేదని భక్తులు కోపగించుకున్నారు. చివరకు ఓ అధికారి వచ్చి మద్యం సేవించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో భక్తులు ఆందోళన విరమించారు. ధర్నా చేస్తున్న భక్తులను పోలీసులు తోసివేయడం కనిపించింది. ఆలయ పవిత్రను కాపాడాలంటూ భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు. తక్షణమే ఈవోను తొలగించాలని అంటున్నారు. భక్తులకు కంపార్ట్‌మెంట్‌లో కనీసం మంచినీటి వసతి కూడా లేదని భక్తులు మండిపడుతున్నారు.



Eha Tv

Eha Tv

Next Story