వాట్సప్ వచ్చాక పుకార్లు ఈజీగా వ్యాపిస్తున్నాయి. నిజమేమిటో తెలుసుకోకుండానే వాట్సప్ మెసేజ్‌లను ఫార్వర్డ్ చేస్తున్నారు. దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. లేటెస్ట్‌గా పెట్రోల్ బంక్‌లు బంద్ అంటూ హైదరాబాద్(Hyderabad)లో ఎవరో రూమర్ పుట్టించారు. అది వాట్సప్‌లలో చక్కర్లు కొట్టింది. అంతే పెట్రోల్ బంకుల దగ్గర జనం బారులు తీరారు.
వాట్సప్ వచ్చాక పుకార్లు ఈజీగా వ్యాపిస్తున్నాయి. నిజమేమిటో తెలుసుకోకుండానే వాట్సప్ మెసేజ్‌లను ఫార్వర్డ్ చేస్తున్నారు. దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. లేటెస్ట్‌గా పెట్రోల్ బంక్‌లు బంద్ అంటూ హైదరాబాద్(Hyderabad)లో ఎవరో రూమర్ పుట్టించారు. అది వాట్సప్‌లలో చక్కర్లు కొట్టింది. అంతే పెట్రోల్ బంకుల దగ్గర జనం బారులు తీరారు. పాతబస్తీలో వాహనదారులు ఒక్కసారిగా బంక్‌లకు వచ్చేసరికి కొన్ని చోట్ల ట్రాఫిక్‌కు కూడా అంతరాయం ఏర్పడింది. కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర నోస్టాక్ బోర్డులు కూడా దర్శనమిచ్చాయి. అయితే, పెట్రోల్ బంక్‌లు బంద్ కాలేదని, వాహనదారులు భయపడాల్సిన పనిలేదని ఇవి పుకార్లేనని బంక్‌ల యాజమాన్యం స్పష్టం చేశారు.