చిరుతలు(Cheetahs) ఈ మధ్యకాలంలో తిరుపతిలో(Tirupati) సంచరిస్తూ భక్తులపై దాడులు చేస్తుండడాన్ని చూశాం. ఓ చిన్నారిని కూడా చిరుత చంపేయడంలాంటి ఘటనలు మరువక ముందే మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో చిరుత సంచరించింది. దీంతో భక్తుల్లో భయాందోళనకుగురవుతున్నారు.

శ్రీశైలంలోని రత్నానందస్వామి ఆశ్రమం అర్ధరాత్రి గోడపై చిరుత సేద తీరుతుండడం కలకలం రేపింది. చిరుతపులిని స్థానికులు, భక్తులు చూసి ఆందోళన చెందారు. చిరుతను దూరం నుంచి చూస్తూ ఫొటోలు(Photo) తీశారు. చిరుత సంచారంపై అధికారులకు సమాచారం అందించాగా.. అప్రమత్తమైన అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా మూడు నెలల క్రితం కూడా శ్రీశైలంలో చిరుత సంచరించింది. ఈ మధ్య కాలంలో చిరుతల సంచారం ఎక్కువైందని స్థానికులు భయంభయంగా గడుపుతున్నారు.

Updated On 31 Dec 2023 4:06 AM GMT
Ehatv

Ehatv

Next Story