పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌లో 1930లో జన్మించారు రాజమల్లు. తన రాజకీయ జీవితాన్ని టీడీపీలో మొదలుపెట్టారు. పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. సుల్తానాబాద్ పీఏసీఎస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తరువాత 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో […]
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌లో 1930లో జన్మించారు రాజమల్లు. తన రాజకీయ జీవితాన్ని టీడీపీలో మొదలుపెట్టారు. పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. సుల్తానాబాద్ పీఏసీఎస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తరువాత 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి చేతిలో ఓడిపోయారు. 1994 ఎన్నికల్లో గీట్ల ముకుందారెడ్డి పై 39 వేల 677 ఓట్ల మెజార్టీతో ఓడించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక 2018లో బీఆర్ఎస్‌లో చేరారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే విజయ రమణారావు గెలుపు కోసం కృషి చేశారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.