పీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అధ్య‌క్ష‌త‌న గాంధీభ‌వ‌న్‌లో కీల‌క స‌మావేశం జ‌రిగింది. స‌మావేశం అనంత‌రం శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి అనే అంశంపై చాలా సేపు మాట్లాడామని తెలిపారు.

పీసీసీ మేనిఫెస్టో కమిటీ(PCC Manifesto Committee) చైర్మన్ శ్రీధర్ బాబు(Sridhar Babu) అధ్య‌క్ష‌త‌న గాంధీభ‌వ‌న్‌(Gandhi Bhavan)లో కీల‌క స‌మావేశం జ‌రిగింది. స‌మావేశం అనంత‌రం శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మేనిఫెస్టో(Manifesto) ఏ విధంగా ఉండాలి అనే అంశంపై చాలా సేపు మాట్లాడామని తెలిపారు. అనేక విషయాలపై సీనియర్ నేతలు చర్చించారన్నారు. వాగ్దానాలకే పరిమితం కాకుండా మేనిఫెస్టో ఉండాలని భావించామ‌న్నారు. సోనియా(Sonia Gandhi) తెలంగాణ ఇచ్చారు. కానీ ఆకాంక్ష నెరవేరడం లేదన్నారు.

ప్రజల జీవితాల్లో మార్పు వచ్చేలా మా మేనిఫెస్టో ఉంటదని తెలిపారు. తెలంగాణ(Telangana) ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది ఉంటదన్నారు. అన్ని వర్గాల ప్రజలందరినీ కోరుతున్నాం. మీ ఆలోచనను మాకు తెలియజేయండి. రండి, మీ సలహా సూచనలు ఇవ్వండి. మార్పుకోసం ఒక్క అడుగు వేయండని.పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో డిక్లరేషన్ లు కలిపి మేనిఫెస్టో లో చేర్చుతాం అని తెలిపారు.

ఐదు గ్యారంటీ హామీలు కూడా ఉంటాయి. ఇవి మేనిఫెస్టోలో భాగమేన‌న్నారు. బుధ‌వారం కూడా మేనిఫెస్టో కమిటీ సమావేశం ఉంటదని తెలిపారు. గాంధీ భవన్ లో కంట్రోల్ రూల్(Control Room), టోల్ ఫ్రీ నెంబర్(Toll Free Number) కూడా ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. శాస్త్రీయ పద్దతిలోనే మా మేనిఫెస్టో ఉంటదని పేర్కొన్నారు.

Updated On 12 Sep 2023 8:54 PM GMT
Yagnik

Yagnik

Next Story