ధరణి(Dharani) విషయంలో ప్రతిసారి కేసీఆర్(KCR) ప్రజలను మాయ మాటలతో ప్రలోభాలకు గురిచేస్తున్నార‌ని పీసీసీ(PCC) మాజీ అధ్యక్షుడు వీ హ‌నుమంత‌రావు ఆరోపించారు. గతంలో రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) నిరుపేదలకు పంచిన భూములు మళ్ళీ తిరిగి భూస్వామ్యలకు దక్కటానికి మాత్రమే ధరణి ఉపయోగపడుతుందని అన్నారు.

ధరణి(Dharani) విషయంలో ప్రతిసారి కేసీఆర్(KCR) ప్రజలను మాయ మాటలతో ప్రలోభాలకు గురిచేస్తున్నార‌ని పీసీసీ(PCC) మాజీ అధ్యక్షుడు వీ హ‌నుమంత‌రావు(Hanumanth Rao) ఆరోపించారు. గతంలో రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) నిరుపేదలకు పంచిన భూములు మళ్ళీ తిరిగి భూస్వామ్యలకు దక్కటానికి మాత్రమే ధరణి ఉపయోగపడుతుందని అన్నారు. ఓఆర్ఆర్ సమీపంలో ఆనాడు పేదవారికి పంచిన భూములు ఇప్పుడు ఎకరం 5 కోట్లు పలుకుతుందని పేర్కొన్నారు. 100 ఎకరాల భూమి.. రూ.500 కోట్ల విలువైన భూమి కేవలం ధరణి పోర్టల్ అడ్డుపెట్టుకొని రెవిన్యూ శాఖ భూస్వాములకు కట్టపెట్టిందని ఆరోపించారు.

12వ తేదీ నిజ నిర్ధారణ‌ కోసం క్షేత్రస్థాయిలో భూముల అసలు యజమానులను మీడియా ముందుకు తీసుకొని వస్తామ‌ని తెలిపారు. కేసీఆర్ అదే రోజు అదే రోట్లో తన ఫామ్ హౌస్ కు పోతున్నారని.. ఒక్క‌సారి అక్కడ ఆగి చూస్తే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. ధరణి వల్ల అంత బాగుందని కేసీఆర్ అనడం అబద్దాలు చెప్పడమేన‌న్నారు. వాస్తవాలు వేరే విధంగా ఉన్నాయి.. పేదలు భూములు నష్టపోతున్నారు.. అందుకు కీసర భూములే ఉదాహరణ అని పేర్కొన్నారు.

Updated On 10 Jun 2023 5:07 AM GMT
Ehatv

Ehatv

Next Story