నేటితో అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు చివరిరోజు కావడంతో ముఖ్య నేతలు సమర్పించే ఆస్తులు, అప్పులపై అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో కొడంగల్(Kondagal), కామారెడ్డి(Kama Reddy)..రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్న పీసీసీ(PCC) చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) నామినేషన్లు(Nomination) దాఖలు చేశారు.

నేటితో అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు చివరిరోజు కావడంతో ముఖ్య నేతలు సమర్పించే ఆస్తులు, అప్పులపై అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో కొడంగల్(Kondagal), కామారెడ్డి(Kama Reddy)..రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్న పీసీసీ(PCC) చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) నామినేషన్లు(Nomination) దాఖలు చేశారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాఖలు చేసిన నామినేషన్ పత్రంలో.. తన పేరు మీద 3.76 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు
చూపించారు.

ఎన్నికల సంఘానికి(Election commission) సమర్పించిన అఫిడవిట్(affidavit) ప్రకారం. రేవంత్‎రెడ్డికి 1,74,97,421 కోట్ల రూపాయల స్థిర ఆస్తులు, 2,02,69,000 కోట్ల రూపాయల చర ఆస్తులు ఉన్నట్లు వెల్లండిచారు. అంటే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం..వాటి విలువ 7,89,69,650 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. తన సతీమణి గీత పేరున 2,27,79,935 కోట్ల రూపాయల చరాస్తులు, 2,36,40,000 కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, భార్య గీత(Geetha) పేరు మొత్తం 9,44,64,000 కోట్ల విలువగల ఆస్తులు ఉన్నాయి. అలాగే ఇద్దరికీ కలిపి మొత్తం రూ. 1,30,19,901 మేర అప్పులున్నట్లు అఫిడవిట్లో చూపించారు.

రేవంత్ రెడ్డి వద్ద రెండు వాహనాలు ఉండగా అందులో ఒకటి హోండా సిటీ, రెండోది బెంజ్. వాటిలో బెంజ్ సెకండ్ హ్యాండ్ కారు. రేవంత్‎రెడ్డి దగ్గర 2 లక్షల రూపాయలు విలువ చేసే పిస్టల్ ఒకటి, 50 వేల రూపాయల విలువ చేసే రైఫిల్ ఒకటి ఉన్నాయి.

ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్‎లో రేవంత్‎రెడ్డి కేసుల వివరాలను వెల్లడించారు. తనపై 36 కేసులు ఉన్నట్లు అఫిడవిట్‎లో తెలిపారు. వాటిలో ఒకటి ఓటుకు నోటు కేసుతోపాటు, ప్రైవేట్ మెడికల కాలేజీల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు చేసిన కేసు కూడా ఉంది. కేసుల్లో ఎక్కువ భాగం శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తారనే అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా 151 సీఆర్పీసీ కింద నమోదు చేసినవే ఉన్నాయి. అయితే 2014 వరకు రేవంత్ రెడ్డిపై ఒక్క కేసు కూడా లేకపోవడం విశేషం.

Updated On 10 Nov 2023 5:11 AM GMT
Ehatv

Ehatv

Next Story