ఇవాళ ఇంద్రవెల్లి(Indravelli) వేదికగా పీసీసీ(PCC) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) లోక్‌సభ ఎన్నికల(Lok sabha elections) శంఖారావం పూరించనున్నారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్‌ కేస్లాపూర్‌ నాగోబా ఆలయాన్ని(Keslapur Nagoba Temple) సందర్శిస్తారు.

ఇవాళ ఇంద్రవెల్లి(Indravelli) వేదికగా పీసీసీ(PCC) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) లోక్‌సభ ఎన్నికల(Lok sabha elections) శంఖారావం పూరించనున్నారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్‌ కేస్లాపూర్‌ నాగోబా ఆలయాన్ని(Keslapur Nagoba Temple) సందర్శిస్తారు. ఆలయ గోపురం, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. తర్వాత స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కులను పంపిణి చేయనున్న ముఖ్యమంత్రి. ఇంద్రవెల్లి అమరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారు. స్మృతివనం అభివృద్ధికి శ్రీకారం చుడతారు సీఎం. అలాగే ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలకు ఇంటిస్థలం పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను పంపిణి చేస్తారు ముఖ్యమంత్రి. అలాగే గిరిజన సంక్షేమ రహదారులతో పాటు పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. తర్వాత తెలంగాణ పునర్నిర్మాణ సభకు హాజరవుతారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

Updated On 2 Feb 2024 12:32 AM GMT
Ehatv

Ehatv

Next Story