ఇవాళ ప్రజా కవి, పద్మవిభూషన్‌ కాళోజీ నారాయణరావు(Kaloji Narayan Rao) 110వ జయంతి.

ఇవాళ ప్రజా కవి, పద్మవిభూషన్‌ కాళోజీ నారాయణరావు(Kaloji Narayan Rao) 110వ జయంతి. 'పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది" అని నినదించిన ఆ మహాకవిని(Poet) స్మరించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలకు ఉంది. తెలంగాణ ప్రాంతానికి ఆ మహానుభావుడు చేసిన సేవలను స్మరించుకుంటూ కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా(Telanagan lanuage day) జరుపుకుంటున్నాం.

నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు (Kaloji Narayana Rao)1914 లో సరిగ్గా ఇదేరోజున కర్నాటక బీజాపూర్‌లోని రట్టిహళ్లిలో జన్మించారు. కాళోజీ అసలు పేరు రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ముద్దుగా ఈయనను కాళోజీ, కాళన్నా అని పిలుచుకునేవారు. కాళోజీ తెలుగు, ఉర్దూ హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లిష్‌ భాషల్లో అనేక రచనలు చేసి ఖ్యాతి గడించారు. తన కవితల ద్వారా పేదలు, తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన రాసిన నా గొడవ సంకలనంలో సమకాలీన సామాజిక సమస్యలను ఏకరువు పెట్టారు. ఆంధ్ర సారస్వత పరిషత్‌ వ్యవస్థాపక సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమి సభ్యుడిగా కూడా సేవలందించారు. కాళోజీ సేవలకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయగా.. భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. తెలంగాణ ప్రభుత్వం ఆయన సేవలకు గౌరవంగా వైద్యవిశ్వవిద్యాలయానికి కాళోజీ నారాయణరావు హెల్త్‌ సైన్సెస్‌ యూనివర్శిటీ అని పేరు పెట్టింది.

Eha Tv

Eha Tv

Next Story