జ‌న‌సేన(Janasena) తెలంగాణ‌లో(Telangana) ప‌లు స్థానాల్లో పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని(Janasena).. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీపుకున్నారు. మొగలి రేకులు' సీరియల్ ఫేమ్‌ సాగర్(Sagar) ఇటీవల జనసేన పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. అత‌డికి జనసేనాని పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు.

జ‌న‌సేన(Janasena) తెలంగాణ‌లో(Telangana) ప‌లు స్థానాల్లో పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని(Janasena).. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీపుకున్నారు. మొగలి రేకులు'(Mogali Rekulu) సీరియల్ ఫేమ్‌ సాగర్(Sagar) ఇటీవల జనసేన పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. అత‌డికి జనసేనాని పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు.

సాగర్ ను తెలంగాణలో జనసేన పార్టీ ప్రచార కార్యదర్శిగా(Party Publicity Secretary) నియమించారు. ఈ మేరకు హైదరాబాదులోని ప్రశాసన్ నగర్ లో ఉన్న జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ నటుడు సాగర్ కు నియామక పత్రాన్ని అందించారు. పార్టీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు సమర్థంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన-బీజేపీ కూటమి సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని సాగర్ కు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.

Updated On 9 Nov 2023 6:52 AM GMT
Ehatv

Ehatv

Next Story