తెలంగాణలో త్వరలోనే కొత్త ఆర్‌వోఆర్‌ చట్టం(ROR act) అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

తెలంగాణలో త్వరలోనే కొత్త ఆర్‌వోఆర్‌ చట్టం(ROR act) అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ చట్టంతో గ్రామస్థాయిలో ఉన్న ఇళ్ల స్థలలాలకు పాస్‌ పుస్తకాలు(Pass book) కేటాయించనున్నట్లు సమాచారం. సాదాబైనామా దరఖాస్తులకు కూడా మోక్షం లభించే అవకాశం ఉంది. భూములకు భూదార్‌ కేటాయింపు ఉంటుంది. హక్కు పత్రాలను జారీ చేసే అధికారాలను ఆర్డీవోలకు కట్టబెడతారు. కొత్త ఆర్‌వోఆర్‌ చట్టంతో భూ రికార్డుల నిర్వహణ పారదర్శకంగా చేయాలని నిర్ణయించారు. ఇళ్ల స్థలాలకు పాస్‌ బుక్‌ ఇవ్వాలనే నిర్ణయంతో 10,894 గ్రామాల్లోని ఇళ్ల స్థలాల యజమానులకు ప్రయోజనం చేకూరనుంది. పాత సమస్యలకు పరిష్కారం లభించనుంది. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 9.24 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త ఆర్వోఆర్‌ ప్రకారం ఈ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. ఆ భూములు అసైన్డ్‌, సీలింగ్‌ చట్టాల పరిధిలో లేకుంటే.. వాటికి హక్కుపత్రాలను జారీ చేస్తారు. ఈ అధికారం ఆర్డీవోకు ఉంటుంది. 1989 నుంచి 2016 వరకు సాదాబైనామా దరఖాస్తులకు తహసీల్దార్లు హక్కుపత్రాలను జారీ చేసేవారు. కొత్త చట్టం ప్రకారం ఆ అధికారాలు ఆర్డీవోలకు దక్కనున్నాయి.కొత్త ఆర్వోఆర్‌ ప్రకారం ప్రభుత్వం మూడు దశల్లో ధరణి పోర్టల్‌లో ఉన్న లోపాలను సవరించనుంది. భూ సమస్యలను కూడా మూడంచెల్లో పరిష్కరించనుంది. ధరణిలో గుర్తించిన 45 రకాల సమస్యలకు పరిష్కారం లభించనుంది.

Eha Tv

Eha Tv

Next Story