☰
✕
ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాకం!
x
శంషాబాద్‌లో(shamshabad) ఓ ఓయో హోటల్ నిర్వాహకుడు హోటల్ గదిలో రహస్యంగా సీసీ కెమెరాలు(CC Camera) ఏర్పాటు చేశాడు. గదులు అద్దెకు తీసుకున్న వ్యక్తుల అశ్లీల చిత్రాలను(Pictures) చిత్రీకరించి బాధితులను బెదిరిస్తున్నాడు. ఇతడి బెదిరింపులను తట్టుకోలేక ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు హోటల్‌ను తనిఖీ చేసి రహస్య సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతడి దగ్గర నుంచి రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Eha Tv
Next Story