తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, ఏఐఎంఐఎం మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.
తెలంగాణ(Telangana)లో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections)ల్లో గెలుపొందేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్(Congress), ఏఐఎంఐఎం(AIMIM) మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్(Wayanad) నుంచి కాకుండా హైదరాబాద్(Hyderabad) నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం సవాల్ విసిరారు. ర్యాలీని ఉద్దేశించి ఒవైసీ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(Ayodhya)లో బాబ్రీ మసీదును కాంగ్రెస్ హయాంలోనే కూల్చివేశారని అన్నారు.
తన పార్లమెంటరీ నియోజకవర్గం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఏఐఎంఐఎం ఎంపీ ఓవైసీ మాట్లాడుతూ.. “నేను మీ నాయకుడు (రాహుల్ గాంధీ)ని వాయనాడ్ నుండి కాకుండా హైదరాబాద్ నుండి ఎన్నికల్లో పోటీ చేయమని సవాలు చేస్తున్నాను, మీరు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూనే ఉన్నారు, రంగంలోకి వచ్చి నాపై పోరాడండని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ వాళ్లు ఎన్నో మాటలు చెబుతారని అన్నారు. నేను పోటీకి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్(Congress) హయాంలో బాబ్రీ మసీదు, సెక్రటేరియట్ మసీదు కూల్చివేశారు.
ఈ నెల ప్రారంభంలో తెలంగాణ(Telangana)లోని తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ(BJP), భారత రాష్ట్ర సమితి(BRS), ఏఐఎంఐఎం ఐక్యంగా పనిచేస్తున్నాయని.. ఈ త్రయంపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని అన్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీ, ఏఐఎంఐఎం లు తమను తాము వేర్వేరు పార్టీలుగా చెప్పుకున్నా ఐక్యంగా పనిచేస్తున్నాయన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై సిబిఐ-ఈడి కేసులు లేవని.. ప్రధాని నరేంద్ర మోదీ వారిని తన "సొంత వారి"గా భావిస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు.