జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(Pawan Kalyan)పై ఓయూ జేఏసీ(OU JAC) తీవ్ర‌స్థాయిలో ధ్య‌జ‌మెత్తింది. బుధ‌వారం ఓయూ ప్రాంగ‌ణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గో బ్యాక్ ప్ర‌తుల‌ను ప‌ట్టుకుని నినాదాలు చేస్తూ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఆపై జేఏసీ నాయ‌కులు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్య‌తిరేకి అని మండిప‌డ్డారు. తెలంగాణ ఎన్నిక‌లకు కొత్త వేషం క‌ట్టి..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(Pawan Kalyan)పై ఓయూ జేఏసీ(OU JAC) తీవ్ర‌స్థాయిలో ధ్య‌జ‌మెత్తింది. బుధ‌వారం ఓయూ ప్రాంగ‌ణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గో బ్యాక్ ప్ర‌తుల‌ను ప‌ట్టుకుని నినాదాలు చేస్తూ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఆపై జేఏసీ నాయ‌కులు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్య‌తిరేకి అని మండిప‌డ్డారు. తెలంగాణ ఎన్నిక‌లకు కొత్త వేషం క‌ట్టి.. ఫ్యాకేజీ కోసం వ‌స్తున్నాడ‌ని ఆరోపించారు. తెలంగాణ వ‌చ్చింద‌ని 14 రోజులు అన్నం తిన‌లేద‌ని ఇక్క‌డ అంటావు.. అక్క‌డ‌కు వెళ్లి తెలంగాణ వాళ్లు ఆంధ్రావాళ్ల‌ని త‌రిమేస్తార‌ని పుల్ల‌లు పెడ‌తావ్ అని ఫైర్ అయ్యారు. గ‌డిచిన ప‌దేళ్ల‌లో ఏవొక్క ఆత్మ‌హ‌త్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని ప‌రామార్శించిన చ‌రిత్ర లేద‌న్నారు. నీకు జెండా, ఎజెండా ఏదీ లేదంటూ ధ్వ‌జ‌మెత్తారు. నీ లాంటి తోక పార్టీ, ఈక పార్టీతో బీజేపీ(BJP)తో పెట్టుకుని నీ ఫ్యాకేజీ కోసం, నీ స్వ లాభం కోసం తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మ‌రోమారు మోసం చేయ‌డానికి వ‌స్తున్నావు.. బిడ్డా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఖ‌బ‌డ్ధార్.. నీ వేశాలు సినిమాల‌లో వేసుకో అని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. 40 ల‌క్ష‌ల మంది రోడ్డున ప‌డితే ఏనాడైనా ఆలోచించావా.. ఎంతోమంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు.. ఏ ఒక్క‌రినైనా ప‌రామ‌ర్శించావా అని ప్ర‌శ్న‌లు సంధించారు. ఇప్పుడు వ‌చ్చి తెలంగాణలో రాజకీయం చేస్తుంటే చూస్తూ ఊరుకోం తరిమి తరిమి కొడతాం అని హెచ్చ‌రించారు. ఎక్కడ ప్రచారంలో పాల్గొన్న కోడిగుడ్లతో, టమాటలతో కొడతామన్నారు.

Updated On 8 Nov 2023 5:03 AM GMT
Ehatv

Ehatv

Next Story