హైడ్రాకు(Hydra) ఇక నుండి హై పవర్స్ ఇచ్చేందుకు గవర్నర్(Governor) ఆమోదం తెలిపారు.
హైడ్రాకు(Hydra) ఇక నుండి హై పవర్స్ ఇచ్చేందుకు గవర్నర్(Governor) ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ(GHMC) చట్టం-1955లోని సెక్షన్ 374బీ ప్రకారం ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులివ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం ఇస్తూ హైడ్రాకు హైపవర్స్‌ను కట్టబెట్టారు. తెలంగాణ పురపాలక చట్టం-2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్‌కు ఉన్న అధికారాలు. తెలంగాణ బీపాస్ చట్టం-2020 ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్, జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్‌కు ఉన్న అధికారాలు. హెచ్ఎండీఏ చట్టం-2008లోని పలు సెక్షన్ల కింద కమిషనర్‌కు ఉన్న అధికారాలు హైడ్రాకు అంటగట్టారు. తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని సెక్షన్ 1317ఎఫ్ ప్రకారం ఆక్రమణల తొలగింపు, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌కు ఉన్న అధికారాలు, తెలంగాణ నీటిపారుదల చట్టంలోని అధికారాలు, జీవో ఎం.ఎస్-67 ద్వారా 2002లో యూడీఏ/ఎగ్జిక్యూటివ్ అధికారికి ఇచ్చిన అధికారాలు. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం-1905లోని పలు సెక్షన్ల కింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డీటీకి ఉన్న అధికారాలు. వాల్టా చట్టం-2002, తెలంగాణ బిల్డింగ్ రూల్స్, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ చట్టంలోని పలు అధికారాలు అప్పగించారు. ఈ కొత్త అధికారాలతో హైడ్రా ముందుకెళ్తుంది. ఇన్ని అధికారాలు ఉపయోగించుకొని హైడ్రా తదుపరి చర్యలు ఉండనున్నాయి. దీంతో ఇప్పటికే నోటీసులు అందుకున్నవారు, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నవారిలో మరింత ఆందోళన మొదలైంది.