లోన్‌యాప్(Loan app) వేధింపులు ఆగడం లేదు. రుణం తీసుకోవాలని వేధిస్తారు. తక్కువ వడ్డీకే రుణాలంటూ ఊదరగొడతారు. దీంతో ఆర్థిక అవసరాలను బట్టి లోన్‌యాప్‌లను సంప్రదించి రుణాలు (Loans)తీసుకుంటారు. తీసుకున్న తర్వాత రుణగ్రహీతలకు చుక్కలు చూపిస్తారు. లోన్‌యాప్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. రుణాలు తిరిగి చెల్లించడంలేదని తన వ్యక్తిగత జీవితం గురించి, ఫొటోలను మార్ఫింగ్(Photos morphing) చేసి బెదిరింపులకు పాల్పడుతారు.
లోన్‌యాప్(Loan app) వేధింపులు ఆగడం లేదు. రుణం తీసుకోవాలని వేధిస్తారు. తక్కువ వడ్డీకే రుణాలంటూ ఊదరగొడతారు. దీంతో ఆర్థిక అవసరాలను బట్టి లోన్‌యాప్‌లను సంప్రదించి రుణాలు (Loans)తీసుకుంటారు. తీసుకున్న తర్వాత రుణగ్రహీతలకు చుక్కలు చూపిస్తారు. లోన్‌యాప్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. రుణాలు తిరిగి చెల్లించడంలేదని తన వ్యక్తిగత జీవితం గురించి, ఫొటోలను మార్ఫింగ్(Photos morphing) చేసి బెదిరింపులకు పాల్పడుతారు. ఈ అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా లోన్‌యాప్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్(Hyderabad) మధురానగర్ పీఎస్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో 29 ఏళ్ల శివ అనే యువకుడు తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. మృతుడు స్వస్థలం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా(East godavari). ఇతను పలు లోన్ యాప్స్ నుంచి రుణాలు తీసుకోవడం జరిగింది. రుణాలు తిరిగి చెల్లించడంలేదని లోన్‌యాప్స్ వేధింపులు మొదలుపెట్టారు. ఈ లోన్‌యాప్ వేధింపులు తాళలేక తల్లిదండ్రులు(Parents) లేని సమయం చూసి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి(Hospital) తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.