సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 11వ తేదీన పినపాక నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

On 11th CM Revanth Reddy will launch the Indiramma housing scheme at Manuguru
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 11వ తేదీన పినపాక నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన పట్టణమైన మణుగూరులో సీఎం పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మణుగూరు మండల కేంద్రంలోని ముత్యాలమ్మనగర్ గ్రామపంచాయితీ ప్రభుత్వ ఐటిఐ కళాశాల సమీపాన సభాస్థలి, పార్కింగ్ ప్లేస్, హెలిప్యాడ్ ఏర్పాటు స్థలాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మణుగూరు డీఎస్పీ వంగా రవీంధర్రెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పినపాక నియోజకవర్గం మణుగూరులో ప్రారంభించేందుకు వస్తున్నారని తెలిపారు. తొలుత బహిరంగ సభ కోసం బూర్గంపాడును ఎంపిక చేశామని.. కొన్ని కారణాల వల్ల సభను మణుగూరుకు మార్చడం జరిగిందన్నారు. సీఎం పర్యటనకు ఇంకా రెండు రోజులే సమయం ఉన్నందున ఏర్పాటు పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
