తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Election 2023)చిత్ర విచిత్రాతి సంఘటనలు జరుగుతున్నాయి. జగిత్యాల(Jagital constituency) అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 80 ఏళ్ల వృద్ధురాలు నామినేషన్‌(Nomination) వేశారు. ఇందులో చిత్రమేమిటనే సందేహం రావచ్చు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Election 2023)చిత్ర విచిత్రాతి సంఘటనలు జరుగుతున్నాయి. జగిత్యాల(Jagityala constituency) అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 80 ఏళ్ల వృద్ధురాలు నామినేషన్‌(Nomination) వేశారు. ఇందులో చిత్రమేమిటనే సందేహం రావచ్చు. ఆమె ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎమ్మెల్యే అవ్వాలనో, మంత్రి పదవి చేపట్టాలనో ఆమె పోటీ చేయడం లేదు. కొడుకు మీద విపరీతమైన కోపంతోనే ఆ 80 ఏళ్ల వృద్ధురాలు ఇండిపెండెంట్‌గా(Independent) పోటీ చేస్తున్నారు. కరీంనగర్‌లో ఉన్న తన ఇంట్లో నుంచి కొడుకు బయటకు వెళ్లగొట్టడంతో సీటీ శ్యామల అనే వృద్ధురాలు ప్రస్తుతం జగిత్యాలలో ఉంటోంది. కొడుకు తప్పుడు పత్రాలు చూపించి ఇల్లు తనదే అని చెప్పడంతో శ్యామల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వివాదంలో కోర్టు తీర్పు ఆలస్యమవుతుండటంతో ప్రజాస్వామ్య వ్యవస్థలపై శ్యామల తీవ్ర అసహనానికి గురైంది. దీంతో నిరసనగా జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసింది.

Updated On 7 Nov 2023 7:11 AM GMT
Ehatv

Ehatv

Next Story