ఉద్యమకారుడిగా, మహా విప్లవ కవిగా తన జీవితాన్ని తాడిత పీడిత ప్రజల కోసం త్యాగం చేసిన
ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని
ఉద్యమకారుడిగా, మహా విప్లవ కవిగా తన జీవితాన్ని తాడిత పీడిత ప్రజల కోసం త్యాగం చేసిన ప్రజా గాయకుడు గద్దర్(Gaddar) జయంతి వేడుకల(Birth Celebrations)ను అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) నిర్ణయించిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) తెలిపారు. సీయం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసిందని, బుధవారం రవీంద్ర భారతీ(Ravindra Bharathi)లో గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమాజంలో ఉన్న అంతరాలు తొలగించాలని తన జీవితాంతం పరితపించి, తన గళంతో జనాలలో చైతన్య స్ఫూర్తిని రగిలించారని ఈ సందర్భంగా గద్దర్ సేవలను గుర్తు చేశారు.