తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది.
తెలంగాణ(Telangana)లోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్(Polling) ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్(Voting) ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికల బరిలో ఉన్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.
ఉదయం నుంచే పలు రంగాల ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కూకట్ పల్లిలో(Kukatpally) బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణ రావు(Madhavram Krishna Rao) ఓటు హక్కు వినియోగించుకున్నారు. శేరిలింగంపల్లి వివేకానంద నగర్ లో బీఆర్ఎఎస్ అభ్యర్థి ఆరికేపూడి గాంధీ ఓటు వేశారు. కుత్బుల్లాపూర్ లోని సత్ జ్జన్ హైస్కూల్ లో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) తన భార్యతో(Lakshmi Pranathi) కలిసి ఓటు వేయడానికి వచ్చారు. జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్ వద్ద లైన్ లో నిలబడి అల్లు అర్జున్(Allu Arjun) ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మాదాపూర్ లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజీ పోలింగ్ స్టేషన్ లో తన సతీమణి తో కలిసి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జి హెచ్ ఎం సి కమిషనర్ రోనాల్డ్ రో స్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్, ఐపీఎస్, జిహెచ్‌ఎంసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ రెండు నెం: 105, అంబర్‌పేటలో కుటుంబంతో సహా ఓటు వేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు అంతా ఓటు వేసేందుకు ముందుకు రావాలి.. పది సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి.. కేసీఆర్ ను మూడో సారి సీఎంను చేస్తుంది.. బీఆర్ఎస్ కు అనుకూలమైన వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఉందని అన్నారు.
జగిత్యాల బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు, మాజీ మంత్రి రాజేశం గౌడ్ తమ స్వంత గ్రామం అంతర్గం లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ దర్శకుడు తేజ జూబ్లీహిల్స్ బిఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మంత్రి మల్లారెడ్డి, ఆయన సతీమణి సికింద్రాబాద్బోయిన్పల్లి సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్ లో ఓటు వేశారు. ఎస్ ఆర్ నగర్ లో బూత్ నంబర్ 188లో సీఈఓ వికాస్ రాజ్ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.