Dinesh Sagar : కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కన్వీనర్ దినేష్
కాంగ్రెస్(congres) పార్టీకి బరువెక్కిన హృదయంతో రాజీనామా(Resigned) చేశారు ఎన్‌ఎస్‌యూఐ(NSUI) జాతీయ కన్వీనర్ దినేశ్ సాగర్(Dinesh Sagar). కాంగ్రెస్‌కు విజయం సాధిస్తుందని గట్టిగా నమ్మానని, అధికారంలోకి వస్తుందని ఆశపడ్డానని కానీ తన ఆశలు అడియాసలయ్యాయని దినేష్ సాగర్ అంటున్నారు. వీర్లపల్లి శంకర్(Veerapalli Shankar) అహంకారధోరణి కారణంగానే పార్టీని వీడుతున్నానని కనీళ్లు పెట్టుకున్నారు.
కాంగ్రెస్(congress) పార్టీకి బరువెక్కిన హృదయంతో రాజీనామా(Resigned) చేశారు ఎన్‌ఎస్‌యూఐ(NSUI) జాతీయ కన్వీనర్ దినేశ్ సాగర్(Dinesh Sagar). కాంగ్రెస్‌కు విజయం సాధిస్తుందని గట్టిగా నమ్మానని, అధికారంలోకి వస్తుందని ఆశపడ్డానని కానీ తన ఆశలు అడియాసలయ్యాయని దినేష్ సాగర్ అంటున్నారు. వీర్లపల్లి శంకర్(Veerapalli Shankar) అహంకారధోరణి కారణంగానే పార్టీని వీడుతున్నానని కనీళ్లు పెట్టుకున్నారు. శంకర్ గెలవడని అర్థమయ్యిందని చెప్పారు. కాంగ్రెస్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన సహచరులతో కలిసి బీఆర్‌ఎస్‌లో(BRS) చేరడానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో దినేశ్ సాగర్‌కు దశాబ్దాల అనుబంధం ఉంది. విద్యార్థి దశ నుంచే దినేష్ కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర నిర్వహిస్తూ వస్తున్నారు. ఊరూరా తిరుగుతూ విద్యార్థులను(Students), యువకులను ఏకం చేశారు. పార్టీలో చేర్పించారు. పార్టీని పటిష్టం చేశారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివిన దినేష్‌కు మంచి ఉద్యోగం లభించింది. ఈయన వార్షికాదాయం సుమారు 36 లక్షల రూపాయలపై చిలుకే! అంత మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టి పార్టీ సేవకే అంకితమయ్యారు. అయిదువేల మందికిపైగా కార్యకర్తలను నియోజకవర్గంలో తయారుచేశారు. కానీ వీర్లపల్లి శంకర్ తన అహంకార ధోరణితో గత అయిదేళ్లలో తనను ఏనాడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు దినేష్. అతని అహంకార ధోరణి కారణంగానే పార్టీకి చాలా మంది దూరమవుతున్నారని తెలిపారు. యువ కార్యకర్తలు చాలామంది పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ అంటే తనకు ఎంతో అభిమానమని, కానీ వీర్లపల్లి శంకర్ కారణంగానే ఇవాళ పార్టిని వదిలిపెట్టాల్సి వస్తున్నదని అన్నారు. ఎంతోకాలంగా పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులను, కార్యకర్తలను పక్కనపెట్టి పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో పార్టీకి ద్రోహం చేసి పార్టీలోంచి వెళ్లిపోయి, ఎన్నికల సమయంలో తిరిగి వచ్చిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం ఆ పార్టీ ప్రతిష్టను దిగజారుస్తుందని అన్నారు. పూర్తి ఆవేదనతో పార్టీని వీడిన ఈ నాయకుడు బీఆర్ఎస్ లో చేరెందుకు రెడీ అయ్యారు.