తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ఉద్యోగులు టీ-షర్టులు, జీన్స్ ధరించి కార్యాలయానికి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ఉద్యోగులు టీ-షర్టులు, జీన్స్ ధరించి కార్యాలయానికి రావద్దని కోరింది. అధికారిక ఉత్తర్వులు లేనప్పటికీ, ఆఫీసుల్లో పని చేసే ఉద్యోగులందరూ డ్రెస్ కోడ్‌కు కట్టుబడి ఉండాలని TSRTC MD సజ్జనార్ ఆదేశించారని TSRTC సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. డ్రైవర్లు, బస్ కండక్టర్లు వారి యూనిఫాం ధరించి వస్తారు. అయితే, టీఎస్‌ఆర్‌టీసీ కార్యాలయంలో అనధికారిక దుస్తులు ధరించి పనిచేసే అధికారులు సంస్థ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని సీనియర్ అధికారి అన్నారు.

TSRTC డ్రైవర్లు మరియు కండక్టర్లు ఖాకీ లేదా నీలిరంగు యూనిఫాం ధరించి విధులకు హాజరవుతూ ఉంటారు. బస్ స్టేషన్లలో సూపర్‌వైజర్లు తెల్లటి యూనిఫాం ధరిస్తారు. అయితే, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బాడీ కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే అధికారులు లేదా ఉద్యోగులకు నిర్దిష్ట డ్రెస్ కోడ్ లేదు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు టీఎస్‌ఆర్‌టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 6న, తెలంగాణ రాష్ట్ర శాసనసభ విలీన బిల్లును ఆమోదించింది. ప్రజా రవాణా సంస్థలోని 43000 మందికి పైగా ఉద్యోగులను ప్రభుత్వ సిబ్బందిగా పరిగణిస్తున్నారు.

Updated On 11 May 2024 4:24 AM GMT
Yagnik

Yagnik

Next Story