నిజామాబాద్(Nizamabad) జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మగవారికి కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా(RTC Free Bus) ప్రయాణం కల్పించాలంటూ బస్టాండ్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ నానా హంగామా సృష్టించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం(congress) అధికారంలోకి రాగానే ఆడవాళ్లకు అందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే.
నిజామాబాద్(Nizamabad) జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మగవారికి కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా(RTC Free Bus) ప్రయాణం కల్పించాలంటూ బస్టాండ్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ నానా హంగామా సృష్టించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం(congress) అధికారంలోకి రాగానే ఆడవాళ్లకు అందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆడవారికి ఆర్టీసీ బస్సులో జీరో టికెట్ ఇస్తున్నారు. ఈ టికెట్ల ద్వారా ఆడవాళ్లు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు.
దీంతో మగవారికి కష్టాలు మొదలయ్యాయి. ఆర్టీసీ బస్సులో వెళ్లాలంటే సీట్లు లేకపోవడంతో నిలబడే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. డబ్బులు చెల్లించి మరీ బస్సులో నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీంతో ఆర్టీసీ బస్సులో మగాళ్లు పడుతున్న కష్టాలను చూసిన నిజామాబాద్ జిల్లాకు చెందిన వాసు(vasu) అనే వ్యక్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళన మొదలుపెట్టాడు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు ఆర్టీసీ బస్సులో మగవారికి కూడా ఉచితంగా ప్రయాణం కల్పించాలని కోరుతూ బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన చేపట్టాడు.ఆర్టీసీ బస్సులో మగవారికి కొన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశాడు. దీంతో అక్కడున్న పోలీసులు అతనికి నచ్చచెప్పి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.