ఓ జంట వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ గ్రామంలో ఎవరికి ఆడ పిల్ల పుడితే వెంటనే వారి ఖాతాలో రెండు వేల రూపాయలు జమచేయాలని నిశ్చయించుకున్నారు. తమ పదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇలాంటి ఉదారమైన నిర్ణయం తీసుకుందీ జంట. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్(Nizamabad) జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియల్‌ గ్రామానికి చెందిన రెడ్డిగారి తిరుపతిరెడ్డి, శ్రావణలక్ష్మి దంపుతులు.

ఓ జంట వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ గ్రామంలో ఎవరికి ఆడ పిల్ల పుడితే వెంటనే వారి ఖాతాలో రెండు వేల రూపాయలు జమచేయాలని నిశ్చయించుకున్నారు. తమ పదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇలాంటి ఉదారమైన నిర్ణయం తీసుకుందీ జంట. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్(Nizamabad) జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియల్‌ గ్రామానికి చెందిన రెడ్డిగారి తిరుపతిరెడ్డి, శ్రావణలక్ష్మి దంపుతులు. తమ పదో వివాహ దినోత్సవ(Wedding Anniversary) వేడుకలను ఈ రకంగా నిర్వహించుకోవాలని వినూత్నంగా ఆలోచించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి పుట్టిన, ఇకపై పుట్టబోయే బిడ్డలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి రూ.2 వేలు దాంట్లో జమ చేయాలని ఆలోచించారు. ఆడపిల్ల పుడితే భారంగా భావిస్తున్న ఈ సమాజంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే సమాజాన్ని చైతన్యవంతం చేసినట్లు అవుతుందని చెప్తున్నారు ఈ దంపతులు. ఆడ పిల్లల ఉన్నత చదువులకు, పెళ్లిళ్లకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా పుట్టిన దగ్గరి నుంచే సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్‌ చేయించి పొదుపు చేయాలన్న ఉద్దేశంతో తామే ఆ ఖాతాలో ముందుగా రూ.2 వేలు వేస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులకు పొదుపై అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తిరుపతిరెడ్డి, శ్రావణలక్ష్మి వివరించారు.

Updated On 8 May 2024 3:26 AM GMT
Ehatv

Ehatv

Next Story