నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్(MLA Rekha Naik) బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో మహిళలకు గౌరవం లేదని.. అందుకే పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని రేఖానాయక్ స్పష్టం చేశారు.

MLA Rekha Naik Goodbye To BRS
నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్(MLA Rekha Naik) బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో మహిళలకు గౌరవం లేదని.. అందుకే పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని రేఖానాయక్ స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతానన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని సస్పెన్స్‌లో పెట్టారు.
ఇదిలావుంటే.. రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్ ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో ఆమె కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల మొదటి జాబితాలో రేఖా నాయక్ పేరు లేకపోవడంతో ఆమె అసంతృప్తికి గురైంది. దీంతో అదే రోజు సాయంత్రం రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి కాంగ్రెస్‌లో చేరారు.
