తెలంగాణ(Telangana) అంతటా పూల పండగ మొదలయ్యింది. తీరొక్క రంగుల పూలతో బతుకమ్మను(Bathukamma) పేర్చి గౌరమ్మను చేసి భక్త శ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ మహిళలు బతుకమ్మ ఆడుతారు.
తెలంగాణ(Telangana) అంతటా పూల పండగ మొదలయ్యింది. తీరొక్క రంగుల పూలతో బతుకమ్మను(Bathukamma) పేర్చి గౌరమ్మను చేసి భక్త శ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ మహిళలు బతుకమ్మ ఆడుతారు. ఆడబిడ్డలను ఇళ్లకు ఆహ్వానించి కుటుంబమంతా సంబరాలు చేసుకుంటారు. ప్రకృతిలో లభించే అన్ని రకాల పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడుతారు.గునుగు, తంగేడు(Thangedu), పట్టుకుచ్చు, బంతి, చామంతి ఇలా రకరకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు
ఒక్కో రోజు ఒక్కో తీరుగా బతుకమ్మను పిల్చుకుంటారు.
మొదటి రోజు: బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ(Engilipula Batukamma) అని పిలుస్తారు. అమ్మకు తులసి ఆకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు.
రెండో రోజు: బతుకమ్మను అటుకుల బతుకమ్మ(Atukula Bathukamma) అని పిలుస్తారు. ఇది ఆశ్వీయుజ మాసం మొదటి రోజైనపౌడ్యమి రోజున నిర్వహిస్తారు. చప్పిడిపప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు.
మూడో రోజు: బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ(Muddapappu Bathukamma) అంటారు. ఈ రోజున ముద్దపప్పు, బెల్లం, పాలు, ఇతర పాల పదార్థాలతో అమ్మకు నైవేద్యం సమర్పిస్తారు.
నాలుగో రోజు: నానబియ్యం బతుకమ్మను(Nanabiyam Bathukamma) చేస్తారు. అంటే నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం వంటివి అమ్మవారికి సమర్పిస్తారు.
అయిదో రోజు: అట్ల బతుకమ్మ(Atla Bathukamma) అంటారు. ఈరోజు అట్లు(దోసలు) తయారు చేస్తారు. అమ్మకు నైవేద్యంగా పెడతారు.
ఆరో రోజు: అలిగిన బతుకమ్మ(Aligina Bathukamma) అంటారు. ఈ రోజు బతుకమ్మ పేర్చరు. ఎలాంటి నైవేద్యం కూడా పెట్టరు.
ఏడో రోజు: వేపకాయల బతుకమ్మ(Vepakayala Bathukamma) అని పిలుస్తారు. సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి, నూనెలో వేయిస్తారు. వాటిని అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.
ఎనిమిదో రోజు: వెన్నముద్దల బతుకమ్మ(Venna muddala Bathukamma) అని పిలుస్తారు. నువ్వులు, వెన్నముద్ద, బెల్లం వంటి పదార్థాలు అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.
తొమ్మిదో రోజు: సద్దుల బతుకమ్మ(Sadhula Bathukamma). చాలా ముఖ్యమైన రోజు. ఇదే రోజు అశ్వయుజ అష్టమి.. దుర్గాష్టమి. సద్దుల బతుకమ్మను పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మరసంతో చేసిన అన్నం, కొబ్బరి అన్నం నువ్వుల అన్నం అమ్మవారికి సమర్పిస్తారు. దీంతో బతుకమ్మ ఉత్సవాలను ముగిస్తారు.