బీఆర్ఎస్‌ (BRS) నుంచి కాంగ్రెస్‌లోకి (Congress) చేరిక‌లు జోరందుకున్నాయి. క‌ర్ణాట‌క ఫ‌లితాల నుంచి జోష్‌లో ఉన్న పార్టీ నేత‌ల‌కు.. చేరిక‌లు కొత్త ఊపునిస్తున్నాయి. గ‌త కొన్ని రోజులుగా తెలంగా కాంగ్రెస్‌లోకి చేరిక‌లు ఊపందుకున్నాయి.

బీఆర్ఎస్‌ (BRS) నుంచి కాంగ్రెస్‌లోకి (Congress) చేరిక‌లు జోరందుకున్నాయి. క‌ర్ణాట‌క ఫ‌లితాల నుంచి జోష్‌లో ఉన్న పార్టీ నేత‌ల‌కు.. చేరిక‌లు కొత్త ఊపునిస్తున్నాయి. గ‌త కొన్ని రోజులుగా తెలంగా కాంగ్రెస్‌లోకి చేరిక‌లు ఊపందుకున్నాయి. ఈ క్ర‌మంలోనే శుక్ర‌వారం గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలో అచ్ఛంపేట నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, న్యాయవాది గంగాపురం రాజేందర్, మాజీ జెడ్పీటీసీ భీముడు నాయక్, అచ్ఛంపేట, చారగొండ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున పార్టీలో చేరారు. నేత‌ల‌కు కండువాకప్పిన రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇక బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కూడా ఆదివారం కాంగ్రెస్ గూటికి చేర‌నున్నారు. ఈ ఉద‌యం రేవంత్.. గురునాథ్ రెడ్డితో భేటీ అయ్యారు.

Updated On 16 Jun 2023 2:21 AM GMT
Ehatv

Ehatv

Next Story