కట్నమే(Dowry) ఎక్కువరా బాబు.. పిల్లనిస్తే చాలు అన్నట్లు ఉన్న ఈ కాలంలో 8 లక్షల కట్నం దొబ్బిన ఓ ప్రబుద్ధుడు.. అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను వేధించాడు. కొత్త ఆశలు, కొత్తకొత్త ఆకాంక్షలతో అత్తింట అడుగుపెట్టిన అమ్మాయికి చివరికి చావే దిక్కయింది. అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు, శారీరక, మానసిక హింసలను(Physical abuse) మనసులోనే పెట్టుకుంది. కోటానుకోట్ల ఆశలతో కొత్తింట్లో అడుగుపెట్టిన యువతి రెండు నెలలు కాకముందే తనువు చాలించింది.

కట్నమే(Dowry) ఎక్కువరా బాబు.. పిల్లనిస్తే చాలు అన్నట్లు ఉన్న ఈ కాలంలో 8 లక్షల కట్నం దొబ్బిన ఓ ప్రబుద్ధుడు.. అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను వేధించాడు. కొత్త ఆశలు, కొత్తకొత్త ఆకాంక్షలతో అత్తింట అడుగుపెట్టిన అమ్మాయికి చివరికి చావే దిక్కయింది. అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు, శారీరక, మానసిక హింసలను(Physical abuse) మనసులోనే పెట్టుకుంది. కోటానుకోట్ల ఆశలతో కొత్తింట్లో అడుగుపెట్టిన యువతి రెండు నెలలు కాకముందే తనువు చాలించింది. పెళ్లయిన రెండు నెలల్లోగానే నవ వధువుకు నూరేళ్లు నిండిపోయాయి. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

వర్ధన్నపేట(Vardhannapet) మండలం ఇల్లంద(Illanda) గ్రామానికి చెందిన బేతి విజయ- వెంకటేశ్వర్లు దంపతుల కూతురే నవ వధువు అర్చన(Archana)(28)ను వరంగల్‌ జిల్లా కొత్తవాడకు చెందిన కందగట్ల విజయలక్ష్మి- వెంకటయ్య దంపతుల కుమారుడు సందీప్‌కు(Sandeep) ఇచ్చి 2022 డిసెంబరు 18న పెళ్లి చేశారు. ఈ సందర్భంగా కట్నం కింద రూ.8 లక్షలు కూడా ఈ మహానుభావుడికి సమర్పించుకున్నారు. కొత్త మురిపం కదా ఓ రెండు నెలలు కాపురం బానే చేశారు. ఆ తర్వాతే అత్తింటి ఆగడాలు బయటపడ్డాయి. అదనపు కట్నం కోసం అర్చనను వేధించారు. సందీప్‌కు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం రావడంతో కాపురం భాగ్యనగరానికి మార్చడంతో సందీప్‌కు ఎదురులేకుండా పోయింది. హైదరాబాద్‌ వచ్చాక భర్త సందీప్‌ అర్చనను మరింతగా వేధించసాగాడు. అదనపు కట్నం తేవాలని అర్చనను శారీరకంగా, మానసికంగా హింసించాడు. తిండి తిప్పలకు లేకుండా నానాహింసలకు పాల్పడ్డాడు. అయితే ఫిబ్రవరి 24న అగ్రంపహాడ్‌ సమ్మక్క- సారలమ్మ జాతర కోసం అర్చన దంపతులు వరంగల్‌ వెళ్లారు. ఆ తర్వాతి రోజు ఫిబ్రవరి 25న రాత్రి అర్చన కుటుంబ సభ్యులకు సందీప్‌ ఫోన్‌ చేసి మీ కూతురును తీసుకెళ్లాలని ఆదేశించాడు. తల్లిదండ్రులతో వరంగల్‌ వెళ్లిన అర్చన అనారోగ్యం పాలైంది. దీంతో అపస్మారక స్థితికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అర్చన అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. భర్త, అత్తమామల వేధింపుల వల్లే తమ కూతురు మృతి చెందిందంటూ అర్చన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అల్లుడు సందీప్‌ సహా అతని కుటుంబ సభ్యులపై బాధితురాలి తల్లి విజయ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

Updated On 28 Feb 2024 2:09 AM GMT
Ehatv

Ehatv

Next Story