కొత్త ఏడాదికి సంతోషంగా, ఆనందంగా స్వాగతం పలకాలని జీహెచ్‌ఎంసీ పోలీసులు సూచనలు చేస్తున్నారు.

కొత్త ఏడాదికి సంతోషంగా, ఆనందంగా స్వాగతం పలకాలని జీహెచ్‌ఎంసీ పోలీసులు సూచనలు చేస్తున్నారు. వేడుకలు విషాదానికి దారితీయొద్దని పేర్కొంటున్నారు. 2025 అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే న్యూ ఇయర్‌ వేడుకల సంరద్భంగా ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొంటున్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో విధించిన ఆంక్షల వివరాలను సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. వేడుకల్లో డ్రగ్స్‌ వినియోగించకుండా నిఘా పెట్టామన్నారు. ఫామ్‌హౌస్‌లు, రెస్టారెంట్లు, పబ్‌లపై దాడులు చేస్తామని తెలిపారు. ఏదైనా కేసులో ఇరుక్కుంటే జీవితం నాశనమని తెలిపారు. డ్రగ్స్‌ వినియోగం చేయకుండా చూడాలని సూచించారు. ఈ బాధ్యత ఈవెంట్ల నిర్వాహకులు, పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులదే అని స్పష్టం చేశారు. ఇక మద్యం సేవించి ఎవరూ రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి విస్తృతంగా డ్రంకన్‌డ్రైవ్‌ను నిర్వహిస్తామని తెలిపారు.

ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే.. రూ.10,000 ఫైన్, 6 నెలలు జైలు శిక్ష

ఈరోజు రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్న తెలంగాణ పోలీసులు

మద్యం తాగి మొదటి సారి పట్టుబడితే రూ.10వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష

రెండోసారి పట్టుబడితే ₹15వేల జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్

డ్రగ్స్ సేవించి దొరికితే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు.

ehatv

ehatv

Next Story