New TPCC President Mahesh Kumar Goud : వారానికి ఇద్దరు మంత్రులు, నెలలో ఒకసారి సీఎం గాంధీ భవన్కు రావాలి
నేను పీసీసీ అధ్యక్షుడు అయిన నేను కార్యకర్తగానే ఉంటానని టీపీసీసీ నూతన చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
నేను పీసీసీ అధ్యక్షుడు అయిన నేను కార్యకర్తగానే ఉంటానని టీపీసీసీ నూతన చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ.. గాంధీ భవన్ దేవాలయం.. విబేధాలు పక్కకు పెట్టీ అందరూ తిరగడంతో మనం అధికారంలోకి వచ్చాము. ఇద్దరు విభిన్నమైన వ్యక్తులతో కలిసి పని చేశాను.. ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నాయకులు అందరినీ కో ఆర్డినేట్ చేయాల్సి వచ్చింది.. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది అందరూ కలిసి పని చేస్తున్నారని పేర్కొన్నారు. నాకు గాంధీ భవన్ తో 40 ఏండ్ల అనుబంధం ఉంది. గాంధీ భవన్ లో నేను తాకని ప్రదేశం లేదన్నారు. ప్రజా స్వామ్యయుతంగా తాను ఉంటానన్నారు.
కౌశిక్ రెడ్డి వాడిన భాష వలన గాంధీ అనుచరులు వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు.. మనది రాయలసీమ కాదు.. కేసీఆర్ సీఎం అయ్యాక భాష మారిపోయింది.. కేసీఆర్ భాష కు రేవంత్ భాషతో సమాధానం చెప్పాడు. అందుకే మనం అధికారం లోకి వచ్చామన్నారు.
నేను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని అనుకోలేదు. నా స్థాయికి నేను పీసీసీ అవుతానని అనుకోలేదు. నాకు ఇన్ని రోజులు పదవులు ఎందుకు రాలేదని నేను అనుకోలేదు.. పని చేస్తూ వెళ్ళాను.. రాజకీయాల్లో ఎంత కష్ట పడి పని చేసినా ఒక్క శాతం అదృష్టం ఉండాలి.. అందుకే నాకు ఎమ్మెల్సీ వచ్చింది.. నాకు పీసీసీ పదవి వచ్చిందన్నారు.
సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ కుటుంబం కోసం వాడుకుందన్నారు. 9 నెలలలో 18,000 కోట్ల రుణమాఫీ చేశాము. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని శ్రేణులకు సూచించారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాను సోషల్ సెన్స్ లేకుండా వాడుతున్నారని విమర్శించారు. నాకు భేషజాలు లేవు.. గాంధీ భవన్ లో పవర్ సెంటర్ లు లేవు.. ఒక్కటే పవర్ సెంటర్ రాహుల్ గాంధీ పవర్ సెంటర్ అని స్ఫష్టం చేశారు.
గాంధీ భవన్ లో 6 గంటలు ఉంటాను. రెండు ఇరానీ చాయ్ లు తాగుతానన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్న ఆస్తులు ఎవరికీ లేవు.. మనకు కూడా జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండాలి. జిల్లాలో పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించండని సీఎంను కోరారు. ప్రతి వారం ఒక ఇద్దరు మంత్రులు గాంధీ భవన్ కు రావాలి. బుధవారం ఒకరు.. శుక్రవారం ఒక మంత్రి అందుబాటులో ఉండాలి. నెలలో ఒక సారి గాంధీ భవన్ కు సీఎం రావాలని కోరారు.