కాంగ్రెస్ నుంచి నూత‌నంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ లు ఈ రోజు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

కాంగ్రెస్(Congress) నుంచి నూత‌నంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు(MLCs) బల్మూరి వెంకట్(Venkat Balmuri), మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) లు ఈ రోజు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. బుధ‌వారం మధ్యాహ్నం 3.30 గంటలకు శాసన మండలి చైర్మన్ ఛాంబర్ లో ఇరువురు నేత‌లు ఎమ్మెల్సీ లుగా ప్రమాణ స్వీకారం చేయనున్నార‌ని టీపీసీసీ(TPCC) ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రులు(Ministers), ఎమ్మెల్యేలు(MLAs) హాజ‌ర‌వుతార‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

బీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి(Kadiyam Srihari), పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వీరిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు ఈ రెండు స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్యే కోటా(MLA Quota)లో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎమ్మెల్సీలుగా ఎన్ఎస్‌యూఐ(NSUI) స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్(BRS) పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవులకు ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు.

Updated On 30 Jan 2024 8:09 PM GMT
Yagnik

Yagnik

Next Story