తెలుగు రాష్ట్రాల్లో బిత్తిరి సత్తికి(Bitiri Sathi) ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన కెరీర్‌లో ఎంతో ఉన్నతంగా ఎదిగాడు బిత్తిరి సత్తి. సినిమాలు, షోలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. 2012లో జీ తెలుగులో ప్రసారమైన కామెడీ క్లబ్ (Comedy Club) అనే రియాలిటీ షోలో పాల్గొన్నాడు. 2015లో వి6 (V6)లో చేరాడు. సావిత్రితో కలిసి ప్రతిరోజూ రాత్రి 9.30కి వచ్చే తీన్మార్ (Teenmar) ప్రోగ్రాంను నిర్వహించారు. తీన్మార్ అనే కార్యక్రమంతో బిత్తిరి సత్తికి పాపులారిటీ రావడమేకాకుండా, ఈ ప్రోగ్రాం విజయవంతమైయింది. లొడాస్ లాగు, పూల అంగి వేసుకొని.. ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు.. తనకే ప్రత్యేకమైన భాషతో అందరినీ అలరించాడు.

తెలుగు రాష్ట్రాల్లో బిత్తిరి సత్తికి(Bitiri Sathi) ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన కెరీర్‌లో ఎంతో ఉన్నతంగా ఎదిగాడు బిత్తిరి సత్తి. సినిమాలు, షోలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. 2012లో జీ తెలుగులో ప్రసారమైన "కామెడీ క్లబ్" (Comedy Club) అనే రియాలిటీ షోలో పాల్గొన్నాడు. 2015లో వి6 (V6)లో చేరాడు. సావిత్రితో కలిసి ప్రతిరోజూ రాత్రి 9.30కి వచ్చే తీన్మార్ (Teenmar) ప్రోగ్రాంను నిర్వహించారు. తీన్మార్ అనే కార్యక్రమంతో బిత్తిరి సత్తికి పాపులారిటీ రావడమేకాకుండా, ఈ ప్రోగ్రాం విజయవంతమైయింది. లొడాస్ లాగు, పూల అంగి వేసుకొని.. ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు.. తనకే ప్రత్యేకమైన భాషతో అందరినీ అలరించాడు.

మరో యాంకర్‌ సావిత్రి అలియాస్ శివజ్యోతి (Shiva Jyothi).. తెలంగాణ యాస, భాషతో తీన్మార్ వార్తలు చదువుతూ అందరినీ ఆకట్టుకుంది. సావిత్రిగా తెలంగాణ ప్రజలందరికీ సుపరిచితమైంది. వీ6 న్యూస్ ఛానల్‌లో వచ్చే తీన్మార్‌ ప్రోగ్రామ్‌కు న్యూస్ ప్రజెంటర్‌గా చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్‌ (Bigg Boss)రియాలిటీ షోలో కంటెస్టెంట్‌ (Contestent)గా చేస్తూ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు దగ్గరైంది.

ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. విడివిడిగానే తమ కేరీర్‌లో ముందుకెళ్తున్నారు. అయితే వీరిద్దరి ఆధ్వర్యంలో వచ్చిన 'తీన్మార్' ప్రోగ్రాం విజయవంతమైంది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పలు వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నా కానీ.. ఓట్ల రూపంలో బీఆర్‌ఎస్‌కు (BRS) మేలు జరగలేదు. బీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు మద్దతుగా, కాంగ్రెస్‌ (Congress)పై వ్యంగంగా వీడియోలు చేసి ప్రచారం నిర్వహించారు. బిత్తిరిసత్తి బీఆర్ఎస్ ప్రచార సభల్లో కూడా పాల్గొన్నాడు. ఎన్నికలు కొద్ది రోజుల ముందు శివజ్యోతి అలియాస్ సావిత్రి సుదీర్ఘ వీడియో విడుదల చేసింది. బీఆర్‌ఎస్ వచ్చిన తర్వాత తెలంగాణలో వచ్చిన మార్పులు, అభివృద్ధిని తన వీడియోలో విశ్లేషించింది.

అయితే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోవడంతో పలువురు కాంగ్రెస్‌ అనుకూల వర్గం వారు వీరిపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయి.. ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారని విమర్శిస్తున్నారు. శివజ్యోతి, బిత్తిరి సత్తికి 'కారు' పార్టీ నుంచి బాగానే ముడుపులు అందుకున్నారని సోషల్‌ మీడియాలో (Social Media) వీరిద్దరినీ ట్రోల్‌ చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసమే తాము బీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చామని పలు సందర్బాల్లో వీరు చెప్పినా.. విమర్శకుల మాత్రం ఒప్పుకోవడం లేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎందుకు వీరు ఎండగట్టలేదని ప్రశ్నించారు. కచ్చితంగా అప్పటి అధికార పార్టీకి వీరు అమ్ముడుపోయారని కొన్ని యూ ట్యూబ్‌ (You Tube) చానెల్స్‌ కూడా విమర్శించాయి. వీరిద్దరూ ఇప్పుడు ఏం చెప్తారని పలువురు బీఆర్‌ఎస్ వ్యతిరేక వర్గానికి చెందిన నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి.. బిత్తిరి సత్తి-శివజ్యోతి ఎలా స్పందిస్తారనేది..!

Updated On 25 March 2024 6:14 AM GMT
Ehatv

Ehatv

Next Story