వరంగల్(Warangal) జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్(nekkonda railway station)కు ఓ విశేషం ఉంది. నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి ఇదే ఏకైక రైల్వేస్టేషన్! చుట్టుపక్కల మండలాలకు చెందినవారంతా ఇక్కడికే వస్తుంటారు తిరుపతి(Tirupati), హైదరాబాద్(Hyderabad), ఢిల్లీ(Delhi), షిరిడీ(Shirdi) వంటి ముఖ్య ప్రదేశాలకు వెళ్లే రైళ్లకు నెక్కొండలో హాల్టింగ్ లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
వరంగల్(Warangal) జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్(nekkonda railway station)కు ఓ విశేషం ఉంది. నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి ఇదే ఏకైక రైల్వేస్టేషన్! చుట్టుపక్కల మండలాలకు చెందినవారంతా ఇక్కడికే వస్తుంటారు తిరుపతి(Tirupati), హైదరాబాద్(Hyderabad), ఢిల్లీ(Delhi), షిరిడీ(Shirdi) వంటి ముఖ్య ప్రదేశాలకు వెళ్లే రైళ్లకు నెక్కొండలో హాల్టింగ్ లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఆదాయం తగ్గుతోందన్న కారణంతో రైల్వే అధికారులు పద్మావతి ఎక్స్‌ప్రెస్(Padmavathi SF Express) తిరుగు ప్రయాణంలో ఈ స్టేషన్‌లో హాల్టింగ్‌ను రద్దు చేశారు. ప్రయాణికుల అనేకమార్లు రిక్వెస్ట్ చేయడంతో సికింద్రాబాద్ నుంచి గుంటూరు(Secunderabad to Guntur)కు వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్(Intercity Express)కు టెంపరరీ హాల్టింగ్ కల్పించారు. అయితే మూడు నెలల పాటు ఆదాయం వస్తేనే పూర్తిస్థాయిలో హాల్టింగ్ కల్పిస్తామని, లేదంటే రద్దు చేస్తామని ఓ కండిషన్ పెట్టారు అధికారులు. దీంతో హాల్టింగ్ కోల్పోకూడదనుకున్న నెక్కొండ గ్రామస్తులు ఓ ఆలోచన చేశారు. నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్ ఫోరం పేరుతో వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో సుమారు 400 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా కలిసి ఇప్పటికే పాతిక వేల రూపాయలను విరాళాల పేరుతో సేకరించారు. ఈ డబ్బుతో రోజూ నెక్కొండనుంచి ఖమ్మం, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు టికెట్లు కొంటున్నారు. స్టేషన్‌కు ఆదాయం చూపించడం కోసమే ఇలా చేస్తున్నారు.