వికారాబాద్(Vikarabad) జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మద్యం(Alcohol) తాగడానికి డబ్బులు(Money) ఇవ్వలేదని తండ్రిని అతి కిరాతకంగా హత్య(Kill) చేశాడు ఓ కొడుకు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. పూడూరు(Puduru) మండల కేంద్రంలో నివాసముంటున్న ముట్టిపూర్తి చంద్రయ్య(muttipurthi chnadraiah) (75) కొడుకు నరసింహులు(Narasimha) మద్యానికి బానిస అయ్యాడు.

Son Killed His Father
వికారాబాద్(Vikarabad) జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మద్యం(Alcohol) తాగడానికి డబ్బులు(Money) ఇవ్వలేదని తండ్రిని అతి కిరాతకంగా హత్య(Kill) చేశాడు ఓ కొడుకు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. పూడూరు(Puduru) మండల కేంద్రంలో నివాసముంటున్న ముట్టిపూర్తి చంద్రయ్య(muttipurthi chnadraiah) (75) కొడుకు నరసింహులు(Narasimha) మద్యానికి బానిస అయ్యాడు. నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి ఇంట్లో వారితో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలోనే పీకలదాకా మద్యం సేవించిన నరసింహులు.. మందు తాగడానికి తనకు డబ్బులు ఇవ్వాలంటూ తండ్రిని అడిగాడు. అందుకు తండ్రి నిరాకరించాడు. తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన నరసింహులు.. ఒక్కసారిగా తండ్రి చంద్రయ్యపై దాడి చేసి గట్టిగా గొంతు నులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారిస్తున్నారు.
