నాంపల్లి కోర్టు పోలీసులపై దాడి కేసులో వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. పోలీసులపై చేయిచేసుకోవడంతో షర్మిలపై 353, 332, 427 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సోమవారం షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
నాంపల్లి కోర్టు(Nampally Court) పోలీసులపై దాడి కేసులో వైఎస్సాఆర్ తెలంగాణ(YSR Telangana Party) పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు(YS Sharmila) 14 రోజుల రిమాండ్(Remand)ను విధించింది. పోలీసులపై చేయిచేసుకోవడంతో షర్మిలపై 353, 332, 427 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సోమవారం షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు మే 8వ తేదీ వరకు రిమాండ్ విధించింది. సోమవారం ఉదయం టీఎస్పీస్సీ పేపర్ లీక్(TSPSC) ను నిరసిస్తూ లోటస్ పాండ్(Lotus Pond) లోని తన నివాసం నుంచి సిట్(SIT) ఆఫీస్ కు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విధుల్లో ఉన్న పోలీసులపై షర్మిల దురుసుగా ప్రవర్తించారు. తనను ఎందుకు బయటకు వెళ్లకుండా ఆపుతున్నారని పోలీసులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే షర్మిలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. చేయి చేసుకున్న వీడియోలు సైతం బయటకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. షర్మిల తల్లి విజయమ్మ(Vijayamma) కూడా లేడి కానిస్టేబుల్‌పై దాడి చేసిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యింది.