మహబూబ్ నగర్(Mahabubnagar) పోలీసులపై ప్రజాప్రతినిధుల కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) సహా పదిమందిపై క్రిమినల్ కేసు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయంత్రం నాలుగు గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి నివేదిక ఇవ్వాలన్న కోర్టు ఆదేశాలు జారీచేసింది.
మహబూబ్ నగర్(Mahabubnagar) పోలీసులపై ప్రజాప్రతినిధుల కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) సహా పదిమందిపై క్రిమినల్ కేసు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయంత్రం నాలుగు గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి నివేదిక ఇవ్వాలన్న కోర్టు ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ ట్యాంపరింగ్(Affidavit Tampering) పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ నాంపల్లి(Nampally) ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.