పోలీసులపై దాడి కేసులో అరెస్ట్ అయిన వైయస్సార్టిపి(YSRTP) అధినేత్రి షర్మిల(YS Sharmila)కు నాంపల్లి కోర్టు(Nampally Court)బెయిల్ మంజూరు చేసింది. సోమవారం నాడు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్(TSPSC Paper Leak) విషయమై సిట్ అధికారులను కలిసేందుకు బయలుదేరిన వైయస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.
పోలీసులపై దాడి కేసులో అరెస్ట్ అయిన వైయస్సార్టిపి(YSRTP) అధినేత్రి షర్మిల(YS Sharmila)కు నాంపల్లి కోర్టు(Nampally Court)బెయిల్ మంజూరు చేసింది. సోమవారం నాడు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్(TSPSC Paper Leak) విషయమై సిట్ అధికారులను కలిసేందుకు బయలుదేరిన వైయస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు షర్మిలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆపై నాంపల్లి కోర్టుకు తరలించగా జడ్జి షర్మిల కి 14 రోజుల రిమాండ్ విధించారు. షర్మిలను కలిసేందుకు పోలీస్ స్టేషన్ కి వచ్చిన విజయమ్మ కూడా మహిళా కానిస్టేబుల్ పై దాడికి పాల్పడడం గమనార్హం. దాడికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.