ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ పోలీసులు శనివారం స్పెషల్ డ్రైవ్‌లో 80 ద్విచక్ర వాహనాల లైసెన్సర్లను స్వాధీనం చేసుకుని వాటిని ధ్వంసం చేశారు

ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ పోలీసులు శనివారం స్పెషల్ డ్రైవ్‌లో 80 ద్విచక్ర వాహనాల లైసెన్సర్లను స్వాధీనం చేసుకుని వాటిని ధ్వంసం చేశారు. నగరంలోని క్లాక్ టవర్ కూడలి వద్ద రోడ్డు రోలర్‌తో అక్రమ సైలెన్సర్‌లను ధ్వంసం చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎస్పీ శరత్‌చంద్ర మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా మోడిఫైడ్‌ సైలెన్సర్‌ల వల్ల శబ్ద కాలుష్యం, పెద్ద శబ్దాలతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. ద్విచక్ర వాహనదారులు మోడిఫైడ్‌ సైలెన్సర్‌లను వాడవద్దని హెచ్చరించిన ఎస్పీ, కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను వినియోగించాలని సూచించారు.

సైలెన్సర్‌లలో ఏవైనా మార్పులు చేసినా క్రిమినల్ కేసులు నమోదవుతాయని పోలీసులు తెలిపారు. మోడిఫైడ్ సైలెన్సర్లు వాడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అక్రమ సైలెన్సర్ల విక్రయాలు, కొనుగోలుపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు అభినందించారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story