Metro Parking Charges : మెట్రో ప్రయాణిలకు బ్యాడ్ న్యూస్
ట్రాఫిక్(Traffic) కష్టాల్లేకుండా సాఫీగా ప్రయాణించాలంటే మెట్రోనే(Metro) మనకు దిక్కయింది. ఉన్న రెండు, మూడు రూట్లలో హాయిగా మెట్రోలో ప్రయాణించవచ్చు. సులబం, కాలుష్యం లేని ప్రయాణం కాబట్టి నగరవాసులు మెట్రోలో ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. మెట్రోతో సౌలభ్యాన్ని గమనించిన నగరవాసులు..తమ ప్రాంతాల్లోనూ మెట్రో సేవలు అందుబాటులోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా మెట్రో మార్గాలను విస్తరించే ప్రణాళికలో ఉంది. అయితే నాగోల్ మెట్రో స్టేషన్‌లో(Nagole metro station) పార్కింగ్ చార్జీలు(Parking reasons) వసూలు చేయాలని మెట్రో సంస్థ నిర్ణయించింది. నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేశారు. నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్నటి వరకు ఉన్న ఫ్రీ పార్కింగ్ ఎత్తివేసి, ధరల బైక్‌కు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.10... 8 గంటల వరకు రూ.25.. 12 గంటల వరకు రూ.40గా నిర్ణయించారు. కార్లకు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.30.. 8 గంటల వరకు రూ.75.. 12 గంటల వరకు రూ.120 చొప్పున ధరల నిర్ణయించారు. దీంతో ప్రయాణికులు ఆందోళన బాట పట్టారు.