మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం(free bus service for women) కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt). ఇది బాగానే ఉంది కానీ బస్సులే స్టాపులలో ఆగడం లేదు. ఇది మహిళలు చెబుతున్న మాట! నాగర్‌కర్నూలు(Nagarkurnool) జిల్లా లింగాల మండలం మాడాపూర్ బస్టాప్ దగ్గర ఇదే జరిగింది.

Telangana
మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం(free bus service for women) కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt). ఇది బాగానే ఉంది కానీ బస్సులే స్టాపులలో ఆగడం లేదు. ఇది మహిళలు చెబుతున్న మాట! నాగర్‌కర్నూలు(Nagarkurnool) జిల్లా లింగాల మండలం మాడాపూర్ బస్టాప్ దగ్గర ఇదే జరిగింది. వచ్చిన బస్సులన్నీ ఆగకుండా వెళ్లిపోతుండటంతో మహిళలు ఆందోళన చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి నిరసన తెలిపారు. కల్వకుర్తి, అచ్చంపేట డిపోల నుంచి తెల్కపల్లి మీదుగా లింగాలకు నడిచే బస్సులు బీఆర్‌ఎస్(BRS) హయాంలో స్టేజీల దగ్గర ఆగేవని, ఇప్పుడు ఒక్క బస్సు కూడా ఆగడం లేదని కోమటికుంట గ్రామాలకు చెందిన మహిళలు ఆవేదన చెందుతున్నారు.
