కామారెడ్డి జిల్లాలో ముగ్గురు పోలీసుల ఆత్మహత్యల కేసు మిస్టరీ వీడలేదు. ఓ ఎస్సై, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్యలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

కామారెడ్డి జిల్లాలో ముగ్గురు పోలీసుల ఆత్మహత్యల కేసు మిస్టరీ వీడలేదు. ఓ ఎస్సై, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్యలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కుప్రియల్ గ్రామంలో ఉన్న అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్దచెరువులో దూకి ఎస్సై సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన సాయికుమార్‌కు 2018లో ఎస్సైగా ఎంపిక అయ్యారు. ప్రస్తుతం భిక్కనూరు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. 2014 బ్యాచ్‌కు చెందిన శృతి బీబీపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. శృతికి గతంలో పెళ్లయి, విడాకులు తీసుకున్నట్లు సమాచారం. శృతితో సాయికుమార్‌కు వివాహేతర సంబంధం ఉందన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత శృతికి నిఖిల్‌తో ప్రేమలో ఉన్నట్లు.. వారిద్దరు పెళ్లిచేసుకోవాలని భావించినట్లు సమాచారం. ఈ వార్త తెలిసిన సాయికుమార్.. శృతి దగ్గరకు వెళ్లాడని.. వీరమధ్య వాగ్వాదం జరగిందని..దీంతో ఆవేశం చెందిన శృతి చెరువులో దూకినట్లు తెలుస్తోంది. ఆమెను కాపాడబోయి సాయికుమర్, అలాగే నిఖిల్ చెరువులో దూకారని ముగ్గురు కూడా మొక్కలు, నాచుతీగల్లో చిక్కుకుని ఊపిరాడక చనిపోయారని పోలీసులు అంచనా వేశారు. శృతి మొఖంపై గాయాలు ఉన్నాయని.. సాయికుమర్, నిఖిల్ కలిసి తన కూతురును హత్య చేశారని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే పోలీసుశాఖలో ఇప్పుడు ఈ వ్యవహారాలు చాలానే బయటకువస్తున్నాయి. బయటకు రాని ఇంకా ఎన్నో వ్యవహారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో పోలీసుల వివాహేతర సంబంధాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సీఐ,ఎస్సై, కానిస్టేబుళ్ల మధ్య ఈ వ్వవహారాలు బాగానే జరుగుతున్నాయి .కొందరు అధికారుల తీరుతో పోలీస్ శాఖ అప్రతిష్టపాలవుతోంది. బుధవారం జరిగిన ఘటనతో పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఓ సీఐ, ఎస్సై మధ్య వివాహేతర సంబంధం బయటపడింది. గీసుగొండ సీఐ, దామెర ఎస్సై మధ్య వివాహేతర సంబంధం బయటపడటంతో వారిని అప్పటి ఐజీ రంగనాథ్ సస్పెండ్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వస్తున్న మహిళలపై ఖాకీల కన్ను పడుతోంది. బాధిత మహిళలకు ఫోన్లు చేస్తూ, మెసేజులు చేస్తూ లొంగదీసుకునే ప్రయత్నాలు బయటపడుతున్నాయి. కొందరు పోలీసులు అయితే మహిళలకు అశ్లీల వీడియోలు పంపిన ఘటనలు ఉన్నాయి.
