Election Ink Drop : చూపుడువేలిపై సిరా చుక్క ఎందుకు వేస్తారు?
మనం ఓటు(Vote) వేశామని చెప్పడానికి సాక్ష్యం(Evidence) వేలి మీద సిరా చుక్క(ink drop)! దొంగ ఓట్లను(Fake Votes) నిరోధించడానికి ఇది ఒక ఆయుధంగా పని చేస్తుంది. నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేయడమే కాకుండా ఒకసారి ఓటు వేసిన వారిని గుర్తు పట్టేందుకు దశాబ్దాలుగా ఈ విధానం అమలవుతూ వస్తోంది. మన దేశంలో మొదటిసారి ఎన్నికలను నిర్వహించినప్పుడు ఎన్నికల కమిషన్(Election Commission) చాలా కష్టపడింది. అనేక సమస్యలను ఎదుర్కొంది. 1951 అక్టోబర్ 25న మొదలైన ఎన్నికల ప్రహసనం 1952 ఫిబ్రవరి 21న ముగిసింది. అన్ని రోజుల పాటు ఎన్నికలను నిర్వహించాల్సి వచ్చింది. అప్పట్లోనే ఓటు వేసినవాళ్లు మళ్లీ ఓటు వేసేందుకు వస్తుండటంతో వారిని ఎలా అడ్డుకోవాలో ఎన్నికల సిబ్బందికి అర్థం కాలేదు.
మనం ఓటు(Vote) వేశామని చెప్పడానికి సాక్ష్యం(Evidence) వేలి మీద సిరా చుక్క(ink drop)! దొంగ ఓట్లను(Fake Votes) నిరోధించడానికి ఇది ఒక ఆయుధంగా పని చేస్తుంది. నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేయడమే కాకుండా ఒకసారి ఓటు వేసిన వారిని గుర్తు పట్టేందుకు దశాబ్దాలుగా ఈ విధానం అమలవుతూ వస్తోంది. మన దేశంలో మొదటిసారి ఎన్నికలను నిర్వహించినప్పుడు ఎన్నికల కమిషన్(Election Commission) చాలా కష్టపడింది. అనేక సమస్యలను ఎదుర్కొంది. 1951 అక్టోబర్ 25న మొదలైన ఎన్నికల ప్రహసనం 1952 ఫిబ్రవరి 21న ముగిసింది. అన్ని రోజుల పాటు ఎన్నికలను నిర్వహించాల్సి వచ్చింది. అప్పట్లోనే ఓటు వేసినవాళ్లు మళ్లీ ఓటు వేసేందుకు వస్తుండటంతో వారిని ఎలా అడ్డుకోవాలో ఎన్నికల సిబ్బందికి అర్థం కాలేదు. అప్పుడే వేలిపై సిరా గుర్తు వేయాలన్న ఆలోచన వచ్చింది. అది కూడా చాలా రోజుల వరకు చెరిగిపోకుండా ఉండే ఇంకు(Ink) అయితే బాగుండనుకుంది. అప్పుడే బ్లూ ఇంక్ పద్దతి(Blue Ink) మొదలయ్యింది. 1962లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections) మొదటిసారిగా బ్లూ ఇంక్‌ను వాడారు. అప్పట్లో ఆర్ అండ్ డీ ఆర్గనైజేషన్(R&D Oraganiztion) ఈ సిరాను తయారు చేసేది. తర్వాత దాన్ని మైసూరుకు చెందిన పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్‌కు(Paints and Varnish Ltd) తయారు చేయడం మొదలు పెట్టింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు మన దేశంలో జరిగే అన్ని ఎన్నికలకు అవసరమయ్యే ఇంకును పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీనే తయారు చేస్తున్నది. ఈ కంపెనీ కెనడా(Canada), కాంబోడియా(Cambodia), మాల్దీవులు, నేపాల్, నైజీరియా, సౌతాఫ్రికా, టర్కీలతో పాటు మరికొన్ని దేశాలకు ఈ ఇంక్‌ను సరఫరా చేస్తోంది. ఇటీవలి కాలంలో ఇంకుతో ఈజీగా ఉపయోగించడానికి మార్కర్ పెన్నులను కూడా తయారు చేస్తోంది. ఇతర దేశాలలో మార్కర్ పెన్నులను వాడుతున్నారు . కానీ మన దేశంలో ఇంకా ఇంకునే వాడుతున్నారు. ఒకప్పుడు అయితే వేలిపై ఇంకు కొన్ని నెలల పాటు చెరిగిపోకుండా ఉండేది. ఇప్పుడు వారం రోజుల పాటు ఉంటుందంతే. ఎన్నికల సమయంలో రాష్ట్రాలకు ఇంకును సరఫరా చేయడానికి ముందు ఈ ఇంక్‌ను పలుమార్లు పరీక్ష చేస్తారు. ఇండెలబుల్ఇంక్‌లో(Indelible Ink) సుమారు 15 నుంచి 18 శాతం సిల్వర్ నైట్రేట్ తో పాటు కొన్నిరసాయనాలను ఉపయోగిస్తారు. అందుకే ఈ సిరా కొన్ని రోజుల వరకు చెరిగిపోకుండా ఉంటుంది. ఈ ఇంకు 5, 7,10, 15, 20, 50 మిల్లీలీటర్ల బాటిళ్లలో దొరుకుతుంది. అయిదు మిల్లీ లీటర్ల బాటిల్ 300 మంది ఓటర్లకు సరిపోతుంది. ఈ బాటిల్ ధర 127 రూపాయల వరకు ఉంటుంది. ఒక సీసాలో సుమారు పది మిల్లీలీటర్ల సిరా ఉంటుంది. వేసిన వ్యక్తులే మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు ఈ సిరాను చూపుడు వేలికి వేస్తారు. ఒకవేళ చూపుడు వేలికి గాయమైనా, చూపుడు వేలు లేకపోయినా మరో వేలికి సిరా చుక్క వేస్తారు. అన్నట్టు ఇంకు తయారీ అత్యంత రహస్యంగా సాగుతుంది. దీని తయారీలో ఉపయోగించే రసాయన ఫార్ములాను నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ ఆఫ్ ఇండియా అత్యంత రహస్యంగా రూపొందిస్తుంది. ఇందులో ఏం వాడారన్నది ఇతరులకు తెలియదు.