హైదరాబాద్‌లోని(Hyderabad) యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) త్వరగా కోలుకోవాలని, తిరిగి ప్రజాజీవితంలో భాగస్వామి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆయన ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కేసీఆర్‌ను పరామర్శించడానికి ప్రముఖులు విచ్చేస్తున్నారు. ఎన్నికల ముందు వరకు కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన వారు సైతం ఆయనను పలకరించి వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో(CM Revanth Reddy) పాటుగా ఆయన మంత్రివర్గంలోని చాలా మంది మంత్రులు కేసీఆర్‌ను పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu naidu) కూడా కేసీఆర్‌ను పరామర్శించి వెళ్లారు.
హైదరాబాద్‌లోని(Hyderabad) యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) త్వరగా కోలుకోవాలని, తిరిగి ప్రజాజీవితంలో భాగస్వామి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆయన ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కేసీఆర్‌ను పరామర్శించడానికి ప్రముఖులు విచ్చేస్తున్నారు. ఎన్నికల ముందు వరకు కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన వారు సైతం ఆయనను పలకరించి వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో(CM Revanth Reddy) పాటుగా ఆయన మంత్రివర్గంలోని చాలా మంది మంత్రులు కేసీఆర్‌ను పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu naidu) కూడా కేసీఆర్‌ను పరామర్శించి వెళ్లారు. ఆరోగ్య స్థితిగతులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీరంగ ప్రముఖులు సైతం యశోద ఆసుప్రతికి వచ్చారు. తన హాస్యంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కేఏ పాల్(KA Paul) కూడా కేసీఆర్‌ను పరామర్శించారు. చివరాఖరికి చినజీయర్ స్వామి(Chinna jeeyar swamy) కూడా వచ్చి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఆయనకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని శ్రీమన్నారాయణుడిని వేడుకున్నారు. కేసీఆర్ ఆసుపత్రిలో(Hospital) చేరి ఇన్ని రోజులవుతున్నా ఒకప్పటి ఆయన సన్నిహితుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మైహోం రామేశ్వరరావు(Myhome rameswar rao) మాత్రం పరామర్శకు రాలేదు. కనీసం చిన్నపాటి కామెంట్ కూడా చేయలేదు. కేసీఆర్-రామేశ్వరరావు మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేని తేలిపోయింది. ఇలాంటి సమయాల్లో విభేదాలు పక్కన పెట్టి కేసీఆర్ దగ్గరకు వెళ్లాలి. రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు, ప్రవీణ్‌కుమార్(Praveen kumar) వంటి వారు అదే చేశారు. మైహోం రామేశ్వరరావు మాత్రం కేసీఆర్‌ను కనీసం పలకరించలేదు. శ్రీరామానుజ మహా విగ్రహావిష్కరణ శిలాఫలకంలో తన పేరు లేకపోవడంతో కినుక వహించిన కేసీఆర్ అప్పట్నుంచే చినజీయర్‌ను, రామేశ్వరరావును దూరం పెట్టారు. తనను ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టారని తెలిసి కూడా చినజీయర్ ఆసుపత్రికి వచ్చారు. ఒకప్పడు కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడిగా పేరు తెచ్చుకున్న రామేశ్వరరావు మాత్రం ఆ పని చేయలేదు. ఇంతకాలం కేసీఆర్‌కు రామేశ్వరరావుకు పడటం లేదన్న వార్తలు అర్ధసత్యాలనుకున్నవారు కూడా ఇప్పుడు నిజమేనన్న భావనకు వస్తున్నారు. రామేశ్వరరావు యశోద(Yashoda) హాస్పిటల్‌కు వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించకపోవడంపై తలోతీరుగా అనుకుంటున్నారు. ఇలాంటి వదంతులకు పుల్‌స్టాప్ పెట్టడానికైనా రామేశ్వరరావు హాస్పిటల్‌కు వెళతారో లేదో చూడాలి!