తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతన చైర్మన్ గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎమ్మెల్యే బాధ్యతలు స్వీకరించారు.

Muthireddy Yadagiri Reddy assumed responsibility as the new chairman of TSRTC
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)) నూతన చైర్మన్ గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(Muthireddy Yadagiri Reddy), ఎమ్మెల్యే బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లోని సంస్థ అధికారిక కార్యాలయం బస్ భవన్ లోని తన ఛాంబర్ లో ఆదివారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్(VC Sajjanar), ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మాట్లాడుతూ.. అనుభవుజ్ఞులైన ఎండీ వీసీ సజ్జనర్ నేతృత్వంలో టీఎస్ఆర్టీసీ అన్ని విభాగాల్లో ముందుకు దూసుకుపోతోందని అన్నారు. తనపై నమ్మకంతో ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించిందన్నారు. తన శక్తి మేరకు సంస్థ వృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు. సంస్థ ఉద్యోగులతో తాను ఒకరిగా సమిష్టిగా పని చేసి.. టీఎస్ఆర్టీసీ లాభాల బాటవైపునకు తీసుకెళ్తామని వివరించారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా తనను నియమించిన సీఎం కేసీఆర్(CM KCR) కు కృతజ్ఞతలు తెలియజేశారు.
