తెలంగాణ(Telangana) భిన్న సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ జాతి భేదాలు ఉండవు. మత భేదాలు ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే గంగా జముని తహజీబ్(Ganga Jamuni Tehzeeb)కు నిలువెత్తు నిదర్శనం ఈ ప్రాంతం! ఇందుకు మరో ఉదాహరణ సూర్యాపేటలో ఓ ముస్లిం యువకుడు వినాయకుడిపై ఎనలేని భక్తిని చాటుకోవడమే!
తెలంగాణ(Telangana) భిన్న సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ జాతి భేదాలు ఉండవు. మత భేదాలు ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే గంగా జముని తహజీబ్(Ganga Jamuni Tehzeeb)కు నిలువెత్తు నిదర్శనం ఈ ప్రాంతం! ఇందుకు మరో ఉదాహరణ సూర్యాపేటలో ఓ ముస్లిం యువకుడు వినాయకుడిపై ఎనలేని భక్తిని చాటుకోవడమే!వినాయకచవితి(Vinayaka Chavithi) పండుగ రోజున సూర్యాపేట(Suryapet)లో ఇంటింటా ఆ ముస్లిం యువకుడు ప్రచురించి పంపిణీ ఏచసిన పుస్తకాలే దర్శనమిస్తున్నాయి. వినాయక చవితి పర్వదినాన సూర్యాపేట వాసులకు ఆ ముస్లిం యుకుడు ఇచ్చిన వ్రత కల్ప విధానం పుస్తకం ఎంతగానో ఉపయోగపడింది. వినాయక వ్రత కల్ప విధానం పుస్తకాన్ని చూసిన మంత్రి జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) దంపతులు మురిసిపోయారు. మంత్ర ముగ్ధులయ్యారు. ఎందుకంటే అందులో సూర్యాపేట నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులన్నింటినీ పొందరుపరిచారు. ప్రస్తుతం ఈ విషయం సూర్యాపేటలో హాట్‌టాపిక్‌గా మారింది. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జురుకు చెందిన ఎస్.కె.మాజిద్ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. 2001 నుంచి జగదీశ్ రెడ్డికి అనుచరుడిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జగదీశ్‌రెడ్డి చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో ముందున్నారు. ఆయనే కాదు, ఆయన కుటుంబం కూడా గులాబీబాటలో నడుస్తోంది. మాజిద్ సోదరుడు ఎస్.కె.మోయిజ్ పజ్జురుకు సర్పంచ్‌గా ఉన్నారు. మిగతా ఇద్దరు సోదరులు కాంట్రాక్టర్లుగా స్థిరపడ్డారు. ఈ క్రమంలో అభిమాన నేత మంత్రి జగదీశ్ రెడ్డి కోసం వినూత్నమైన ఆలోచన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో జిల్లా కేంద్రంగా మారిన సూర్యాపేట పట్టణంలో జరిగిన అభివృద్ధి వివరాలను ఇంటింటికి చేర్చాలని నిర్ణయించారు. అందుకు అనువైన మార్గం హిందువులకు ప్రధాన పండుగ అయిన వినాయకచవితిని ఎంచుకున్నారు. చవితి రోజున హిందులందరికీ చేరే విధంగా వినాయక వ్రత కల్ప విధానం పుస్తకాన్ని అందించాలనుకున్నారు. అందులోనే పట్టణాభివద్ధిని ప్రతిబింబించే వివరాలు, ఛాయా చిత్రాలను పొందుపరిచారు. క్వాలిటీలో ఎక్కడా రాజీ లేకుండా పుస్తకాన్ని ప్రచురించారు. పట్టణంలో ఈ పుస్తకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పుస్తకాన్ని చూసిన మంత్రి జగదీశ్‌రెడ్డి, సునీతా జగదీశ్‌రెడ్డిలు ఆనందపడ్డారు. ప్రతి ఏడాది భక్తులకు మట్టి వినాయకుడి విగ్రహాలను అందించే జగదీశ్‌రెడ్డి దంతపులు ఈసారి విగ్రహంతో పాటు వ్రత కల్ప విధానం పుస్తకాన్ని కూడా అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం గంగా జముని తహజీబ్‌కు తార్కణంగా ఈ పుస్తక పంపిణీతో సూర్యాపేటలో మత సామరస్యం వెల్లి విరిసిందంటున్నారు ప్రజలు. వినాయక చవితి సందర్భంగా వినాయక వ్రత కల్ప పుస్తకాన్ని ప్రచురించి పంపిణీ చేయడం పట్ల మాజీద్‌ను పట్టణవాసులు అభినందిస్తున్నారు.