మూసీ నది టెన్షన్

రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బుధవారం వలిగొండ మండలం సంగెం గ్రామం వద్ద లోలెవల్ వంతెనపై మూసీ నది ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీలో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో బొల్లేపల్లి-సంగెం మధ్య రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ముందుజాగ్రత్త చర్యగా బొల్లేపల్లి-సంగం రహదారిపై వాహనాలను అనుమతించకుండా లోలెవల్ వంతెనకు ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇన్‌ఫ్లో పెరిగిన నేపథ్యంలో మూసీ ప్రాజెక్టు నాలుగు క్రెస్ట్ గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 6,581 క్యూసెక్కులుగా నమోదైంది. మూసీ ప్రాజెక్టులో ఫుల్‌ ట్యాంక్‌ మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 643 అడుగులకు చేరుకుంది. దీంతో నదీపరివాహక ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి.


Sreedhar Rao

Sreedhar Rao

Next Story