బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి అయ్యాడు. దీంతో మృతుడి కుటుంబంలో విషాదం నెల‌కొంది. మెదక్(Medhak) జిల్లాలో ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. వివ‌రాళ్లోకెళితే.. మురళి (20) అనే యువకుడు క్రికెట్ బెట్టింగ్‌కు(Cricket Betting) అలవాటు పడ్డాడు. మొదట బెట్టింగ్‌లో డ‌బ్బులు గెలవడంతో.. అదే ఉత్సాహంతో బెట్టింగ్‌కు పాల్ప‌డ్డాడు. ఈ క్ర‌మంలోనే న‌ష్టాలపాలై..

బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి అయ్యాడు. దీంతో మృతుడి కుటుంబంలో విషాదం నెల‌కొంది. మెదక్(Medhak) జిల్లాలో ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. వివ‌రాళ్లోకెళితే.. మురళి (20) అనే యువకుడు క్రికెట్ బెట్టింగ్‌కు(Cricket Betting) అలవాటు పడ్డాడు. మొదట బెట్టింగ్‌లో డ‌బ్బులు గెలవడంతో.. అదే ఉత్సాహంతో బెట్టింగ్‌కు పాల్ప‌డ్డాడు. ఈ క్ర‌మంలోనే న‌ష్టాలపాలై.. అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఐదు లక్షల రూపాయలు అప్పులు చేశాడు.

అప్పులు ఇచ్చినవారు డబ్బులు తిరిగివ్వ‌మ‌ని అడ‌గ‌టం ప్రారంభించారు. అప్పుల బాధ భరించలేకపోయిన‌ మురళి.. ఐదు లక్షలు అప్పు చేసినట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భూమి అమ్మి అయినా అప్పు తీర్చుదామని భరోసా ఇచ్చారు. తన వల్ల తల్లిదండ్రులు భూమి అమ్మాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌న్న మనోవేదనతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని(Suicide) ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై స‌మాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుప‌త్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 4 Aug 2023 1:41 AM GMT
Ehatv

Ehatv

Next Story