బీఆర్ఎస్ పార్టీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఆదివారం మృతి చెందారు. గుండెపోటుకు గురై హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అనుకోని ఘటనతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Mulugu District Brs President Kusuma Jagadish Died With Heart Attack Cm Kcr Express Condolence
బీఆర్ఎస్ పార్టీ(BRS Party)లో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్(Mulugu ZP Chairman) కుసుమ జగదీష్(Kusuma Jagadish) ఆదివారం మృతి చెందారు. గుండెపోటుకు గురై హన్మకొండ(Hanamkonda)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అనుకోని ఘటనతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుసుమ జగదీష్ అకాల మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, సీఎం చంద్రశేఖర్ రావు(CM Chandrashekar Rao) తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుసుమ జగదీశ్ మృతి పట్ల ఆవేదన చెందారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని భగవంతున్ని ప్రార్థించారు. తెలంగాణ ఉద్యమకారుడిగా నాటి ఉద్యమంలో జగదీష్ పోషించిన చురుకైన పాత్రను, ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడు(Mulugu District BRS President)గా, జిల్లా పరిషత్ చైర్మన్ గా జగదీష్ చేస్తున్న సేవలను సీఎం స్మరించుకున్నారు. జగదీష్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. జగదీష్ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
