ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాలో తాడికొండ రాజయ్య పేరు లేకపోవడం అందరికీ తెలిసిన విషయమే.
ఇటీవల బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాలో తాడికొండ రాజయ్య(Thatikonda Rajaiah) పేరు లేకపోవడం అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య రాజయ్య కన్నీటి పర్యంతమైన విషయం కూడా తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ(MRPS Leader Manda Krishna Madiga).. స్టేషన్ ఘన్‌పూర్(Station Ghanpur) ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు అండగా నిలిచారు.
మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. 99 శాతం ప్రజలు రాజయ్యను ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని అన్నారు. స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరి(Kadiam Srihari)పై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని.. రాజయ్య డిప్యూటీ సీఎం(Deputy CM) పదవి పోవడానికి కడియమే కారణమని మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. రాజయ్యకు మళ్లీ టికెట్(Ticket) రాకుండా చేశారని ఆరోపించారు. కడియం శ్రీహరి గుంటనక్క లాంటివారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 99 శాతం ప్రజలు రాజయ్యను ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని.. కడియంకు బీఫామ్ ఎలా వస్తుందో చూస్తామని హెచ్చరించారు. రాజయ్యకు ఇవ్వకపోతే మరొకరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.